Uttar Pradesh Polls: బీజేపీకి తలనొప్పిగా హత్రాస్ రేప్ కేసు-మూడోదశ ఎన్నికల్లో ప్రభావం

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు మూడో దశకు చేరుకుంటున్నాయి. మూడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనంలోకి వెళ్తున్న బీజేపీ నేతలకు హత్రాస్ రేప్ ఘటన వెంటాడుతోంది. యోగీ ఆదిత్యనాథ్ హయాంలో జరిగిన ఈ ఘటనను సమర్ధించుకోలేక, తప్పుబట్టలేక బీజేపీ సతమతం అవుతోంది.

Recommended Video

    UP Elections 2022:PM Modi రిక్వెస్ట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు | Yogi Adityanath | Oneindia Telugu

    బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న క్రమంలో యూపీ మూడో దశ పోరులో హత్రాస్ ఘటన కాషాయ పార్టీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2020 సెప్టెంబర్లో హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, హత్య జరిగాయి. దీన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ టార్గెట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో తమ ప్రభుత్వ శాంతిభద్రతలపై చెప్పుకుంటున్న యోగీ ఆదిత్యనాథ్ కు ఇబ్బందికరంగా మారుతోంది.

    Hathras rape case trouble for bjp in uttar pradesh third phase poll

    హత్రాస్‌లో తాజాగా నిర్వహించిన ఓ ప్రచార సభలో పాల్గొన్న అఖిలేష్... "దురదృష్టవశాత్తూ ఆ దళిత బాలికకు సకాలంలో తగిన చికిత్స లభించలేదన్నారు, ఆమె చనిపోయినప్పుడ ఆమె కుటుంబ సభ్యులు ఆమెను దహనం చేయడానికి అనుమతించలేదన్నారు. తీవ్రంగా అవమానించారని గుర్తుచేశారు. బాలిక మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా రాత్రిపూట బలవంతంగా దహనం చేశారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో అఖిలేష్ కు కౌంటర్ ఇవ్వడానికి బీజేపీ వద్ద అస్త్రాలు లేకుండా పోతున్నాయి.

    హత్రాస్‌లో తాజాగా జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..మార్చి 10 తర్వాత సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వేడి ఆవిరైపోతుందన్నారు. గత ఎస్పీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్ల ఈ ప్రాంతం అపఖ్యాతి పాలయ్యిందని యోగీ ఆరోపించారు. అఖిలేష్ పాలనలో తమంచవాడీలు (దేశీయ తయారీ పిస్టోల్స్ పట్టుకునే వారు) అధికారంలో ఉన్నారని, మాఫియాలా కాల్పులు జరిపారని, కబ్జాలకు పాల్పడ్డారని, , ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫేక్ కేసులను ఎదుర్కొన్నారని విమర్శించారు. అయితే హత్రాస్ ఘటనపై మాత్రం నేరుగా ఆయన స్పందించడం లేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+