యాక్టర్ బంధువు ఇల్లు: బాత్రూంలో రూ.5.7 కోట్లు, 28 కిలోల గోల్డ్
హవాలా ఆపరేటర్ నివాసంపై ఐటి అధికారులు దాడులు చేసి బాత్రూంలో దాచిన పెద్ద మొత్తాన్ని, బంగారాన్ని స్వాధీనమం చేుకున్నారు. అక్రమ నగదును, ఆభరణాలను వారు కనిపెట్టారు.
బెంగళూరు: ఓ హవాలా ఆపరేటర్ నివాసంపై ఆదాయం పన్ను అధికారులు దాదడులు నిర్వహించిన రూ.5.7 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వాటిలో కొత్త రెండు వేల నోట్లు ున్నాయి. కాగా, రూ.90 లక్షల మేర పాత వంద రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు ఉన్నాయి. దానితో పాటు 28 కిలోల బంగారాన్ని, 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వాటిని బాత్రూంలో దాచి పెట్టాడు. ఆ ఇల్లు కన్నడ సీనియర్ నటుడు దొడ్డన్న అల్లుడు వీరేంద్రది అంటూ వార్తలు వచ్చాయి. కర్ణాటకలోనూ, గోవాలోనూ ఐటి అధికారులు శుక్రవారంనాడు 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హుబ్బలి, చిత్రదుర్గు జిల్లాల్లోని కాసినో ఆపరేటర్లపై, బులియన్ ట్రేడర్లపై దాడులు నిర్వహించారు.

హవాలా ఆపరేటర్లలో ఒకతను పాత నోట్లను మార్పిడి చేయడంలోనూ పాత కరెన్సీని వాడి బులియన్‌ను పోగు చేయడంలోనూ మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. కాగా, హవాలా ఆపరేటర్ నివాసంలోని బాత్రూంలో అక్రమ నగదు, ఆభరణాలు ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించారు.
పలు పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వాటిని విశ్లేషిస్తున్నారు. కొత్త నోట్ల చాలా వరకు చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె పట్టణానికి చెందినవని తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications