Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను జైల్లో పెట్టాలని సీఎం పక్కాప్లాన్ చేశారు, పాపం ప్లాన్ రివర్స్ అయ్యింది, మాజీ సీఎం ఫైర్!

గతంలో కెంపయ్య అనే పోలీసు అధికారిని అడ్డం పెట్టుకుని సిద్ధరామయ్య నన్ను అరెస్టు చేయాలని పథకం పన్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. అయితే తనను ఒక్కరోజు అయినా జైలులో పెట్టాలని అనుకున్న సీఎం సిద్దరామయ్య కోరిక మాత్రం ఇంత వరకు నెరవేరలేదని గతంలో జరిగిన ఓ విషయాన్ని మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్ డీ కుమారస్వామి బహిరంగంగా చెప్పారు.

ఈ విషయమై బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి నన్ను కనీసం ఒక్కరోజైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సీఎం సిద్దరామయ్య ప్లాన్ చేసి అదే విషయం పోలీసు అధికారి కెంపయ్యకు చెప్పారని, ఆ సమయంలో విచారణకు వెళ్లవద్దని మా న్యాయవాది సూచించారని, అప్పట్లో సిద్దరామయ్య ప్లాన్ రివర్స్ అయ్యిందని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

HD Kumaraswamy accused CM Siddaramaiah of planning to send him to jail

ఇప్పుడు 2,900 మహిళలు ఉన్న కేసు అని అంటున్నారని, అయి0తే ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేదని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాకు చెప్పారు. హాసన్‌ పెన్‌డ్రైవ్‌ కేసులో అసలు సూత్రధారి అయిన కారు డ్రైవర్‌ కార్తీక్‌ను ఓ ప్రైవేట్‌ ఛానెల్‌లో కూర్చోబెట్టి శిక్షణ ఇచ్చి మాట్లాడిస్తున్నారని, ఇలాంటి సీన్లు చూస్తుంటే ఈ కేసు విచారణ ఏ దిశగా సాగుతుందో అర్థమవుతోందని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

హాసన్ కేసును విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారని, ఆ సిట్ పని చేస్తోందా లేదా అని అనుమానంగా ఉందని కుమారస్వామి ఆరోపించారు. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందానికి దొరకని కారు డ్రైవర్ కార్తీక్ ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడని, సిట్ కు చిక్కకుండా అతను ఓ ప్రైవేట్ టీవీ చానల్ కార్యాలయంలోకి ఎలా వెళ్లాడని హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ ను ప్రశ్నించారు.

కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ ను నేను ఒకటే అడగాలనుకుంటున్నానని, మీ విచారణ కేవలం మా అన్న హెచ్ డీ రేవణ్ణపై కేంద్రీకరించబడిందని ఆరోపించారు. అయితే ఆ వీడియోలు విడుదల చేసిన వారిని ఎందుకు వదిలేశారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. ఇప్పటి వరకు మీరు చేసిందేమీ లేదని కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు.

కారు డ్రైవర్ కార్తీక్ ప్రైవేట్ ఛానెల్ కూర్చుని శిక్షణ తీసుకుని మాట్లాడుతున్నట్లు మాకు అర్థం అవుతోందని కుమారస్వామి ఆరోపించారు. హోం మంత్రి పరమేశ్వర్ ఏం చేస్తున్నారు అని హెచ్ డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ కార్తీక్ గత 14 ఏళ్లుగా రేవణ్ణ ఇంట్లో పని చేస్తున్నాడు, ప్రజ్వల్ ప్రవర్తన తెలిసి అతను ఎందుకు ఉద్యోగం మానేయలేదు అని కుమారస్వామి ప్రశ్నించారు.

బండ నాయకుడు తనను ఎలా కాపాడుతాడో అని ఎదురు చూశాడని, ఆ బండ నాయకుడు తనను కాపాడుతాడని కార్తీక్ భావింయాడని, అతను గిరినగర ప్రాంతంలోనే ఉన్నాడని తెలుస్తోందని కుమారస్వామి ఆరోపించారు. బహుశా కారు డ్రైవర్ కార్తీక్ కు వీళ్లు శిక్షణ ఇస్తున్నారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. నవీన్ గౌడ, కార్తీక్, హాసన్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్‌లకు సిట్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఈ ముగ్గురూ ఎంత క్లోజ్ గా ఉన్నారో చూస్తే తెలుస్తోందని, వాళ్ల రిలేషన్ ఏంటి అనే విషయం తెలుస్తోందని, వాళ్ల ఫొటోలు వైరల్ అయ్యాయని, ఇదంతా సిట్ గమనించలేదా అని మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+