భారీ వర్షాలతో తమిళనాడు విలవిల.. తాజా పరిస్థితి ఇలా!!

భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం విలవిలలాడుతోంది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా 17 రైళ్ళను రద్దు చేశారు. విమాన రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతున్న పరిస్థితి తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారత వాతావరణ శాఖ రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికను జారీ చేసింది. కన్యాకుమారి జిల్లాలో నేడు పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. మధ్య హిందూ మహాసముద్రం, దక్షిణ శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తుఫాను పయనం ఇప్పుడు కొమోరిన్ ప్రాంతం పొరుగు ప్రాంతాలపై కేంద్రీృక్రితమై ఉంది.

Heavy rains hit to Tamil Nadu.. This is the latest situation!!

ఈరోజు, దక్షిణ తమిళనాడులో చాలా చోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి కారైకల్‌లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రేపు, దక్షిణ తమిళనాడులోని కొన్ని చోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.

ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్, పోలీసు బలగాలను మోహరించి వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, టుటికోరిన్ జిల్లాల్లోని 84 సహాయ కేంద్రాల్లో ఏడు వేల మందికి పైగా ప్రజలను రక్షించి ఆశ్రయం కల్పించినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు. ఈరోజు చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన 80కి పైగా పడవలు సహాయ, సహాయక చర్యల్లో పాల్గొన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+