ప్రేమంటే కలిసి బతకడమే: ధర్మేంద్రతో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని(ఫొటో)

ముంబై: ప్రేమంటే ఒకరి కోసం ఒకరు జీవించడమేనని బాలీవుడ్‌ అలనాటి నాయిక, భారతీయ జనతా పార్టీ ఎంపి హేమమాలిని అన్నారు. ఆమె 35వ వివాహ వార్షికోత్సవ వేడుకలను భర్త ధర్మేంద్రతో ఘనంగా నిర్వహించారు.

చాలా రోజుల తర్వాత పెళ్లి రోజును చాలా ప్రశాంతంగా జరుపుకుంటున్నానంటూ ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు. ధర్మేంద్రతో కలిసి కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను సైతం పోస్టు చేశారు. 66ఏళ్ల హేమమాలిని రెండు ఫొటోలను ట్విట్టర్‍‌లో పోస్ట్ చేశారు.

Hema Malini on 35th Marriage Anniversary: Love is Togetherness

ఒక ఫొటోలో కేక్ కట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ధర్మేంద్రతో హేమామాలిని ఉన్న దృశ్యం. మరో ఫొటోలో హేమామాలిని నుదుటిపై ధర్మేంద్ర ముద్దు పెడుతున్న దృశ్యం.

కాగా, సీతా ఔర్ గీతా, డ్రీమ్‌గర్ల్, ది బర్నింగ్ ట్రెయిన్ లాంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. 1980లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఈషా డియోల్, అహానా డియోల్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వీరు కూడా బాలీవుడ్ నటులే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+