Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లికి ముందు రోజు పెళ్లికూతురు ఏం చేసిందంటే ?, పొలంలోనే అంతా అయిపోయింది !

బెంగళూరు/మైసూరు: వయసుకు వచ్చిన కుమార్తెకు పెళ్లి చెయ్యాలని ఆమె తండ్రి అనుకున్నాడు. బంధువుల అబ్బాయితో యువతి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెద్దలు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరిని పిలిచారు. ఇంటి ముందు రోజు పెళ్లికుమార్తె ఇంటి ముందు పెళ్లిపందిరి వేశారు. పెళ్లికి సర్వం సిద్దం చేశారు. అయితే పెళ్లికూతురి దెబ్బకు ఆమె తండ్రి శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు.

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా (మైసూరు జిల్లా పక్క జిల్లా)లోని గుండ్లుపేట తాలుకాలోని హోరదహళ్ళి గ్కామంలో పుట్టేగౌడ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. పుట్టేగౌడ కుమార్తె సుచిత్రా డిగ్రీ వరకు చదువుకుంది. ఇదే సమయంలో సుచిత్రా గుండ్లుపేట తాలుకాలోని హోరదహళ్ళిలోనే నివాసం ఉంటున్న మల్లేష్ అనే యువకుడితో స్నేహం పెంచుకుంది.

Her father committed suicide after the bride ran away with her boyfriend near Mysuru

కొంతకాలం నుంచి సుచిత్రా మల్లేష్ ప్రేమించుకుంటున్నారు. ప్రియుడు మల్లేష్ బైక్ లో సుచిత్రా షికార్లు తిరగడం మొదలుపెట్టింది. సుచిత్రా ప్రియుడు మల్లేష్ తక్కువ కులానికి చెందినవాడు కావడం, ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ విషయం జీర్ణించుకోలేక ప్రియురాలు సుచిత్రా మీద మండిపడుతూ వచ్చారు. పెద్దలు బుద్దిమాటలు చెప్పడంతో సుచిత్రా కొంచెం సైలెంట్ అయ్యింది.

ఇదే సందర్బంలో పుట్టేగౌడ అతని సమీప బంధువు అయిన శివేగౌడ కుమారుడితో సుచిత్రా వివాహం నిశ్చయం చేశాడు. శివేగౌడ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి సుచిత్రా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుచిత్రా పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన ఆమె తండ్రి పుట్టేగౌడ పెళ్లి పత్రికలు ముద్రించి బంధువులు. అతను నివాసం ఉంటున్న గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో అందరికి పంచిపెట్టాడు.

ఇంటి ముందు పెళ్లిపందిరి వేశారు. ఇంటి ముందు పెళ్లి పందిరి వేసిన రోజు పెళ్లి కూతురు సుచిత్రా నేను బ్యూటీపార్లల్ కు వెళ్లి వస్తానని ఆమె తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత గుండ్లుపేటలో ప్రియుడు మల్లేష్ తో చాలాసేపు మాట్లాడిన సుచిత్రా ఆమె ప్రియుడి బైక్ లోనే పరారైయ్యింది. పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకుని ఇంటికి వచ్చిన పుట్టేగౌడ పెళ్లికూతురు బయటకు వెళ్లి ఇంకా ఇంటికి రాలేదని తెలుసుకుని షాక్ అయ్యాడు.

Her father committed suicide after the bride ran away with her boyfriend near Mysuru
వెంటనే బందువుల ఇళ్లలో. గుండ్లు పేటలోని బ్యూటీపార్లల్ దగ్గరకు వెళ్లి సుచిత్రా కోసం గాలించారు. తరువాత తెలిసిన వ్యక్తి మీ కుమార్తె సుచిత్రా కొన్ని గంటల ముందు మల్లేష్ బైక్ లో వెళ్లిందని పుట్టేగౌడకు చెప్పాడు. వెంటనే మల్లేష్ ఇంటి దగ్గరకు వెళ్లిన పుట్టేగౌడ, అతని బంధువులు మల్లేష్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డారు. మల్లేష్ ఇంటి దగ్గర గొడవ రచ్చరచ్చ అయ్యింది.

పెళ్లి ముందు రోజు పెళ్లికూతురు సుచిత్రా ఆమె ప్రియుడు మల్లేష్ తో పారిపోయిందనే అవమానంతో పుట్టేగౌడ అతని పొలంలో పురుగుల మందు తాగడంతో పాటు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ముందు రోజు పెళ్లికూతురు సుచిత్రా ఆమె ప్రియుడితో పారిపోవడంతో పెళ్లికుమార్తె తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేసు విచారణలో ఉందని చామరాజనగర జిల్లా పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+