• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దంగల్ హీరో దయాగుణం..! గోదుమపిండి సంచిలో 15వేల నగదు పంచుతున్న అమీర్ ఖాన్..!!

|

ముంబాయి/హైదరాబాద్ : పేదలకిచ్చిన ఒక్కో గోధుమ పిండి సంచిలో 15 వేల రూపాయల నగదును అందించి అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు వైవిద్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన అమీర్ ఖాన్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆకలితో అలమటిస్తోన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ముందుకొచ్చారు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం ఆహార పదార్థాలను తాను సినిమాల్లో పోషించే పాత్రల మాదిరిగా వినూత్నంగా పంచుతున్నారు. నిరు పేదలు పస్తులుండకూదనే ఉద్దేశంతో గోదుమ పిండి బ్యాగ్ తో పాటు నగదు సహాయం కూడా చేరవేస్తున్నారు. అమీర్ ఖాన్ ఉదార స్వబావానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శభాష్ అంటున్నట్టు తెలుస్తోంది.

నిరుపేదల పట్ల ఉదార గుణం..

నిరుపేదల పట్ల ఉదార గుణం..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆకలితో అలమటిస్తోన్న పేద ప్రజలను ఆదుకుందుకు ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ముందుకొస్తున్న ఉదంతాలను చూస్తున్నాం. కొంత మంది కూరగాయలు పంచుతుంటే మరికొంత మంది నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరికొంత మంది వేడేవేడి భోజనం సిద్దం చేసి లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిరుపేద అభాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే యజ్ఞంలో భాగంగా చాలా మంది జీవనోపాది కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని కడు నిరుపేద ప్రజల బ్రతుకు దెరువు మాత్రం కడు దుర్బరంగా మారిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.

గోదుమపిండితో పాటు 15వేల క్యాష్..

గోదుమపిండితో పాటు 15వేల క్యాష్..

సరిగ్గా ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు పేరొందిన సినిమా నటీనటులు నిరుపేదల ఆకలి దప్పులను తీర్చేందుకు ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన వంతుగా సామాజిక సేవను వినూత్నంగా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోధుమ పిండి సంచుల్లో పేదల కోసం 15 వేల రూపాయలను పంపించారనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంవం పట్ల నెటిజన్లు హీరో అమీర్ ఖాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆశ్యర్యానికి గురైన నిరుపేదలు..

ఆశ్యర్యానికి గురైన నిరుపేదలు..

ఇక ఈ నెల ఏప్రిల్ 23న ఢిల్లీలోని నిరుపేద మురికి వాడల ప్రాంతానికి వచ్చిన కొందరు వాలంటీర్లు ట్రక్‌లోంచి గోధుమ పిండి సంచులు తీసి నిరుపేదలకు పంచడం ప్రారంభించారు. వాటి కోసం చాలా మంది క్యూ లైన్లలో నిల్చొని ఇంటికి తీసుకెళ్లారు. కొందరు అయితే గోధుమ పిండి మాత్రమే ఇస్తున్నారని నిరాకరించారు. ఇక సంచులు తీసుకుని ఇంటికి వెళ్లిన వారు దాన్ని తెరిచి చూడగా.. అందులో. 15 వేల నగదు ఉన్నట్టు గ్రహించారు. ఇలా ఒక ప్యాకెట్ ఇవ్వడం ద్వారా ఎంతో అవసరం ఉన్న వారు మాత్రమే తీసుకుంటారని, అమీర్ ఖాన్ పథకం రచించినట్టు చర్చ జరుగుతోంది. అయితే వీటిని నిజంగానే అమీర్‌ ఖాన్ పంపించారా..? లేదా అనే అంశం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది.

  AP CM Jagan Asks For lockdown Extension in Conference With PM Modi
  రంజాన్ మాసం ప్రత్యేకత..

  రంజాన్ మాసం ప్రత్యేకత..

  పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవగానే పేదలకు అందించే నిత్యావసర సరుకుల్లో వినూత్న మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ లో ఐసోలేషన్ లో ఉన్న ముస్లింల కోసం చికెన్ బిర్యానిని ప్రత్యేకంగా తయారు పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దాంతో పాటు జూబ్లీ హిల్స్ లో ఉన్న ఎనిమిది వందల ముస్లిం కుటుంబాలకు ప్రత్యేకంగా హలీం తయారు చేయించి పంపిణీ చేయిస్తున్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. దీంతో రంజాన్ మాసం పేదల పాలిట వరంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది.

  English summary
  Bollywood star hero Aamir Khan is also sharing the food stuff for the poor people.In order to help the poor, they are carrying a bag of wheat flour and cash. Bollywood film industry and sector of poor people seems to be in favor of Aamir Khan's generosity.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X