Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ సీఎం ఫ్యామిలీ ఫైటింగ్, ఒకేచోట ఏం జరుగుతుందో చూడండి, స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు !

శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఇప్పుడు అదంతా ముందుమాట అని, కంచు కోటలు కూడా మారుతూ ఉంటాయని శ్యాండిల్ వుడ్ హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ అన్నారు. శివమొగ్గలో ఈసారి అభిమానులు, దేవుడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నానని డాక్టర్ శివరాజ్ కుమార్ చెప్పారు.

దావణగెరెలో కరటక దమనకా విజయోత్సవ సభలో పాల్గొన్న తరువాత హీరో శివరాజ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. నా భార్య గీతా శివరాజ్ కుమార్‌కి శివమొగ్గ గురించి ఏమీ తెలీదని కొందరు సోషల్ మీడియాలో బహిరంగంగా చేస్తున్న ఆరోపణలు సరికాదని శివరాజ్ కుమార్ అన్నారు. గీతా శివరాజ్ కుమార్ శివమొగ్గలో జన్మించారని, అక్కడే పెరిగారని, ఇప్పటికీ ఆమె శివమొగ్గకు వస్తూ పోతూ ఉంటారని ఆమె భర్త శివరాజ్ కుమార్ చెప్పారు.

Hero Shivraj Kumar said that his wife Geeta is the daughter of former CM and she knows about politics
తన భార్య గీతా తండ్రి అంటే మా మామ ఎస్. బంగారప్ప కర్ణాటక సీఎంగా పని చేశారని, మాజీ సీఎం కూతురిగా, శివమొగ్గలో పుట్టిపెరిగిన మహిళగా ఇక్కడి సమస్యల గురించి తన భార్య గీతాకు తెలుసు అని, తన భార్య సోదరుడు మధు బంగారప్ప కూడా రాజకీయాల్లో ఉన్నారని, అందుకే గీతాకు కూడా శివమొగ్గ గురించి బాగా తెలుసని శ్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ మీడియాకు చెప్పారు.

సోషల్ మీడియాలో గీతా శివరాజ్ కుమార్‌పై వేసిన కొన్ని ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. మీకు రాజకీయాల గురించి, శివమొగ్గ గురించి ఏమి తెలుసు అని అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు అని పలువురు గీతా శివరాజ్ కుమార్ ను ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు హీరో శివరాజ్ కుమార్ స్పందించారు. గీతాకు శివమొగ్గలోని సమస్యల గురించి తెలుసు అని, ఆమె కుటుంబం కూడా రాజకీయ నాయకుల కుటుంబమే అని శివరాజ్ కుమార్ గుర్తు చేశారు.

Hero Shivraj Kumar said that his wife Geeta is the daughter of former CM and she knows about politics

మా కుటుంబం కూడా రాజకీయాలు లేదని తాను చెప్పడం లేదని, మా నాన్న (డాక్టర్ రాజ్ కుమార్) బతికున్నప్పుడు మా ఇంటికి అనేక పార్టీల రాజకీయ నాయకులు వచ్చేవారని, అలా మాకు కూడా రాజకీయాలపై అవగాహన ఉందని, రాజకీయాల గురించి తెలుసు అని శివరాజ్ కుమార్ అన్నారు. గీతా శివరాజ్ కుమార్ లోక్ సభ ఎన్నికల సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. శివమొగ్గలో రెండు సీఎం కుటుంబాల మధ్య లోక్ సభ ఎన్నికల అంశంపై తాను పెద్దగా వ్యాఖ్యానించబోనని, ఎన్నికల ఫలితాల తరువాత మాట్లాడుతానని శ్యాండిల్ వుడ్ హీరో శివరాజ్ కుమార్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+