Hijab Row: హిజాబ్, చెప్పిందే చెప్పి కోర్టు టైమ్ వేస్ట్ చేస్తున్నారు, విచారణ వాయిదా వేసిన హైకోర్టు !
బెంగళూరు: హిజాబ్ దరించే విషయంలో కర్ణాటక హైకోర్టులో బుదవారం కూడా జోరుగా వాదనలు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం, విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సలహా కమిటీలు, అభివృద్ది కమిటీలు కావాలనే హిజాబ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ముస్లీం అమ్మాయిల తరుపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు మరోసారి ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లోని విద్యార్థుల మద్య తారతమ్యం చూపిస్తోందని న్యాయవాది రవివర్మ ఆరోపించారు. విద్యాశాఖా అధికారులు గతంలో జారీ చేసిన నోటీసుల్లో ఎక్కడా కూడా యూనీఫామ్ మీద హిజాబ్ లు వేసుకోకూడదని సూచించలేదని, యూనీఫామ్ విషయం మాత్రమే చెప్పిందని, యూనీఫామ్ లో మార్పులు చెయ్యాలంటే ఏడాది ముందే విద్యార్థుల కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని న్యాయవాది రవివర్మ హైకోర్టులో వాదనలు వినిపించారు. స్కూల్స్, కాలేజ్ ల్లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు యూనీఫామ్ తో పాటు తల మీద హిజాబ్ ధరిస్తామని మనవి చేస్తున్నారని, యూనీఫామ్ మీద బుర్కాలు వేసుకుంటామని వారు చెప్పడం లేదని అమ్మాయిల తరపు న్యాయవాది రవివర్మ హైకోర్టులో మనవి చేశారు. హిజాబ్ విషయంలో దాఖలు అయిన పిటిషన్లలో అన్ని ఒకే రకమైన వాదనలు ఉన్నాయని, వాదనలు పూర్తి అయిన విషయాలపై మళ్లీ చర్చ, వాదనలు అవసరం లేదని, పదేపదే చెప్పిన విషయాలే చెప్పి కోర్టు సమయాన్ని వృదా చెయ్యకూడదని కర్ణాటక హైకోర్టు తిసభ్య భెంచ్ న్యాయవాదులకు చూసించింది. గురువారం మద్యాహ్నం 2. 30 గంటలకు పిటిషన్ విచారణ వాయిదా వేస్తున్నామని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య బెంచ్ చెప్పింది.
Recommended Video

రాష్ట్ర ప్రభుత్వం, సలహా సమితీలు ఇంత చేస్తున్నాయి
హిజాబ్ దరించే విషయంలో కర్ణాటక హైకోర్టులో బుదవారం కూడా జోరుగా వాదనలు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం (బీజేపీ), విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన స్థానిక విద్యాసంస్థల సలహా కమిటీలు, అభివృద్ది కమిటీలు కావాలనే ముస్లీం అమ్మాలు దరిస్తున్న హిజాబ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన కొందరు ముస్లీం అమ్మాయిల తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు మరోసారి ఆరోపించారు.

ప్రభుత్వం తేడా చూపిస్తోంది
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లోని విద్యార్థుల మద్య తారతమ్యం చూపిస్తోందని ముస్లీం తరపున వాదిస్తున్న న్యాయవాది రవివర్మ కుమార్ ఆరోపించారు. విద్యాశాఖా అధికారులు గతంలో జారీ చేసిన నోటీసుల్లో ఎక్కడా కూడా యూనీఫామ్ మీద హిజాబ్ లు వేసుకోకూడదని సూచించలేదని, ఎలాంటి యూనీఫామ్ వేసుకోవాలి అనే విషయం మాత్రమే చెప్పిందని న్యాయవాది రవివర్మ కుమార్ కోర్టుకు చెప్పారు.

ఏడాది ముందే కుటుంబ సభ్యులకు చెప్పాలి
స్కూల్, కాలేజ్ యూనీఫామ్ లో మార్పులు చెయ్యాలంటే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మార్పులు చెయ్యాలని నియమాలు ఉన్నాయని న్యాయవాది రవివర్మ కుమార్ కోర్టులో చెప్పారు. కర్ణాటక విద్యాశాఖా అధికారులు యూనీఫామ్ లో మార్పులు చెయ్యాలంటే ఏడాది ముందే విద్యార్థుల కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని న్యాయవాది రవివర్మ కుమార్ కర్ణాటక హైకోర్టులో వాదనలు వినిపించారు.

హిజాబ్ లు మాత్రం వేసుకుంటారు..... బుర్కాలు కాదు
కర్ణాటకలోని ప్రభుత్వ స్కూల్స్, కాలేజ్ ల్లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు యూనీఫామ్ తో పాటు తల మీద హిజాబ్ ధరిస్తామని మనవి చేస్తున్నారని, యూనీఫామ్ మీద బుర్కాలు వేసుకుంటామని వారు చెప్పడం లేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే వివాదం కావడానికి కారణం అయ్యారని అమ్మాయిల తరపు న్యాయవాది రవివర్మ కుమార్ కర్ణాటక హైకోర్టులో వాదనలు వినించారు.

ముంబాయి సీనియర్ లాయర్
హిజాబ్ వివాదంలో వాదనలు జరుగుతున్న కర్ణాటక హైకోర్టులో అమ్మాయిల తరుపున వాదనలు వినిపించడానికి ముంబాయి సీనియర్ న్యాయవాది యూసఫ్ ముచ్చల కర్ణాటక హైకోర్టుకు హాజరైనారు. ముంబాయి నుంచి వచ్చిన న్యాయవాది యూసఫ్ ముచ్చల కర్ణాటక హైకోర్టులో వాదనలు వినిపించారు.

మనోభావాలు కాపాడుకోవాలని ఆశ, వేరే ఉద్దేశం లేదు
హిజాబ్ లు దరించడానికి ముస్లీం అమ్మాయిలకు అనుమతి ఇవ్వాలని, వారి మనోభావాలు గౌరవించాలని, అమ్మాయిలు వారి మత సాంప్రధాయాలు కాపాడుకోవాలని ముస్లీం అమ్మాయిలు కోర్టును ఆశ్రయించారని, అందులో వేరే ఉద్దేశం లేదని ముంబాయి న్యాయవాది యూసఫ్ ముచ్చల కర్ణాటక హైకోర్టులో వాదనలు వినిపించారు. పదేపదే చెప్పిందే చెప్పి కోర్టు సమయాన్ని వృదా చెయ్యకూడదని కర్ణాటక హైకోర్టు తిసభ్య భెంచ్ న్యాయవాదులకు చూసించింది. గురువారం మద్యాహ్నం 2. 30 గంటలకు పిటిషన్ విచారణ వాయిదా వేస్తున్నామని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య బెంచ్ చెప్పింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications