వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుభవంతోనే అనర్హులను చేశాను: జయలలితో సహ నాపైన వేటు, తమిళనాడు స్పీకర్ ధనపాల్ !

చట్టపరంగానే తాను అన్నాడీఎంకే పార్టీతో సంబంధం లేని వ్యక్తితో (టీటీవీ దినకరన్) కలిసి తిరుగుతున్నారని.

|
Google Oneindia TeluguNews

చెన్నై: చట్టపరంగానే తాను అన్నాడీఎంకే పార్టీతో సంబంధం లేని వ్యక్తితో (టీటీవీ దినకరన్) కలిసి తిరుగుతున్నారని, నియోజక వర్గాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారని 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశామని తమిళనాడు స్పీకర్ ధనపాల్ సమర్థించుకున్నారు.

దినకరన్ తిక్క చేష్టలతోనే ఇంత జరిగింది: మన్నార్ గుడి మాఫియాకు శశికళ ఫుల్ క్లాస్ !దినకరన్ తిక్క చేష్టలతోనే ఇంత జరిగింది: మన్నార్ గుడి మాఫియాకు శశికళ ఫుల్ క్లాస్ !

తమిళనాడు ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలించిన తరువాత 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని మూడు సార్లు సూచించినా వారు పట్టించుకోలేదని, అందుకే పార్టీ నియమాలు ఉల్లంఘించారని అనర్హత వేటు వేశానని తమిళనాడు స్పీకర్ ధనపాల్ వివరించారు.

History repeats in Tamil Nadu Assembly

అన్నాడీఎంకే పార్టీ చిహ్నంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేని టీటీవీ దినకరన్ తో కలిసి అధికారంలో ఉన్న సొంత పార్టీ మీద తిరుగుబాటు చేస్తే అదే పార్టీ చీఫ్ విప్ రాజేంద్రన్ ఫిర్యాదు చేస్తేనే తాను అన్ని వ్యవహారాలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ ధనపాల్ అన్నారు.

తమిళనాడు సీఎం గ్రూప్ లో స్లీపర్ సెల్స్ స్లీపింగ్: దినకరన్ ను నమ్ముకుంటే పదవి, పరువు !తమిళనాడు సీఎం గ్రూప్ లో స్లీపర్ సెల్స్ స్లీపింగ్: దినకరన్ ను నమ్ముకుంటే పదవి, పరువు !

1988లో అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో స్పీకర్ ధనపాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ధనపాల్ జయలలిత వర్గంలో ఉన్నారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ కు వ్యతిరేకంగా ఉన్న జయలలితతో పాటు ధనపాల్ తదితరుల మీద అప్పటి తమిళనాడు స్పీకర్ పీహెచ్. పాండియన్ అనర్హత వేటు వేశారు.

అధికారంలో ఉన్న సొంత పార్టీ మీద 1988లో తాను తిరుగుబాటు చేసిన సమయంలో అప్పటి స్పీకర్ పీహెచ్. పాండియన్ అనర్హత వేటు వేశారని అదే అనుభవంతో తాను ఇప్పుడు చర్యలు తీసుకున్నానని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సమర్థించుకుంటున్నారు.

English summary
TamilNadu assembly Speaker Dhanapal who disqualified 18 Dinkaran Supporting AIADMK MLAS on today. In 1988 the same AIADMK MLA Dhanapal was disqualified by Former Speaker PH Pandiyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X