హోంమంత్రితో బయటపడ్డ హీరోయిన్ లింక్.. కానుకలు పెద్దవే..!

కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో హోంమంత్రి జి. పరమేశ్వర, నటికి వివాహ కానుక ఇచ్చారంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. నటితో హోంమంత్రికి చెందిన విద్యాసంస్థలకు ఆర్థిక లావాదేవీలున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రన్యారావుకు, పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో సదరు వైద్య కళాశాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ పరిణామాల మధ్య డీకే శివకుమార్, పరమేశ్వర నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.

Home Minister G Parameshwara gave wedding gifts to actress Ranya Rao - DK Shivakumar

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "ప్రజా జీవితంలో ఉన్న మేము చాలా కార్యక్రమాలకు వెళ్తుంటాం. పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కానుకలు ఇవ్వడం సహజం. పెళ్లి సమయంలో నటికి గిఫ్ట్ ఇచ్చానని మంత్రి తెలిపారు, ఇందులో తప్పు లేదు" అని శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే, రన్యారావు నేరపూరిత చర్యలను ఏ రాజకీయ నాయకుడూ సమర్థించరని ఆయన స్పష్టం చేశారు.

కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి అక్రమంగా 14.7 కిలోల బంగారాన్ని తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడింది. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రన్యారావు వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి.పరమేశ్వర కూడా హాజరైనట్లు తెలియడంతో, హోంమంత్రికి సంబంధించిన కళాశాలపై ఈడీ దాడులు జరగడం రాజకీయంగా మరింత వేడిని రాజేసింది. ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+