డేరాబాబాతో ఆ సంబంధం నిజమా.. ప్రశ్నలు సిద్ధం: హనీప్రీత్‌తో మరో మహిళ

డేరా బాబు దత్త పుత్రిక హనీప్రీత్‌ను పోలీసులు మంగళవారం రాత్రి ప్రాథమికంగా విచారించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కోసం పోలీసులు చాలా ప్రశ్నలు సిద్ధం చేశారని తెలు

Recommended Video

    ప్రశ్నలు సిద్ధం..డేరాబాబాతో ఆ సంబంధం నిజమా? హనీప్రీత్‌ తో మరో మహిళ..! | Oneindia Telugu

    న్యూఢిల్లీ: డేరా బాబు దత్త పుత్రిక హనీప్రీత్‌ను పోలీసులు మంగళవారం రాత్రి ప్రాథమికంగా విచారించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కోసం పోలీసులు చాలా ప్రశ్నలు సిద్ధం చేశారని తెలుస్తోంది.

    అత్యాచారాలు అవన్నీ నిజమేనా?

    అత్యాచారాలు అవన్నీ నిజమేనా?

    డేరా ఆశ్రమంలో సాధ్విలపై అత్యాచారం నిజమేనా? భక్తులను చంపి ఆశ్రమంలో పూడ్చి పెట్టారా? మీకు - గుర్మీత్ ఉన్న సంబంధం ఎలాంటిది? మీ భర్త చేసిన సంచలన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎందుకు మీకు, గుర్మీత్‌కు మధ్య అక్రమ సంబంధాన్ని అంటకట్టారు? శిష్యులను హిజ్రాలుగా మారుస్తున్నారని వచ్చిన ఆరోపణలు నిజమేనా? డేరాకు అత్యధికంగా నిధులను సమకూర్చేది ఎవరు? ఏ రాజకీయ నాయకులు ఎక్కువగా ఆశ్రమానికి వచ్చేవారు? డేరా గుహలో పూల్ పార్టీలు నిర్వహించారా? వాటికి హాజరైన ధనవంతులైన మహిళలు ఎవరు? వంటి ప్రశ్నలను తయారు చేశారు.

     డేరాలో బిగ్ బాస్ వంటి ఆటపై

    డేరాలో బిగ్ బాస్ వంటి ఆటపై

    డేరాలో బిగ్ బాస్ వంటి షో ఆడేవాళ్లా? ఆడితే అందులో ఎవరెవరు పాల్గొన్నారు? డ్రగ్స్ వాడుతారా? సాధ్వీలుండే గదుల్లోకి రహస్య సొరంగాలు ఎందుకు ఏర్పాటు చేశారు? గుర్మీత్ ఆ మార్గాల ద్వారా సాధ్వీల గదుల్లోకి వెళ్లేవారా? సినిమా రంగంలోకి ప్రవేశించింది ఎందుకు? బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికేగా? భక్తుల విరాళాలతోనే డేరాలో విలాసవంతమైన కట్టడాలు కట్టారా? వంటి ప్రశ్నలనూ అడగనున్నారు.

    అర్ధరాత్రి వరకు ప్రశ్నించారు

    అర్ధరాత్రి వరకు ప్రశ్నించారు

    కాగా, గత రాత్రి మహిళా పోలీసు అధికారులు హనీప్రీత్‌ను అర్థరాత్రి వరకూ విచారించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

     హనీప్రీత్ అరెస్ట్‌కు ముందు

    హనీప్రీత్ అరెస్ట్‌కు ముందు

    డేరా బాబుకు శిక్ష పడినప్పటి నుంచి పరారీలో ఉన్న హనీప్రీత్ అరెస్టుకు ముందు మాత్రం ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ తర్వాత రోజు పోలీసులకు చిక్కింది. హనీప్రీత్.. డేరా బాబు అనుచరుడు సుఖ్‌దీప్‌తో పాటు పారిపోయింది.

    అరెస్ట్ సమయంలో హనీప్రీత్‌తో పాటు మరో మహిళ

    అరెస్ట్ సమయంలో హనీప్రీత్‌తో పాటు మరో మహిళ

    హనీప్రీత్‌ను అరెస్టు చేసినప్పుడు ఆమెతో పాటు మరో యువతి కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. హనీప్రీత్ ఇన్నాళ్లు సదరు యువతితో కలిసి ఎస్‌యూవీ వాహనంలో పలుచోట్లకు తిరిగిందని చెబుతున్నారు.

    హనీప్రీత్‌కు సహకరించిందెవరో తేలాలి?

    హనీప్రీత్‌కు సహకరించిందెవరో తేలాలి?

    ఇన్నాళ్లు హనీప్రీత్‌కు సహకరించింది ఎవరో తేలాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఇన్నాళ్లు ఆమె ఎక్కడ ఉంది, ఎవరు సహకరించారు.. ఈ విషయాలన్ని విచారణలో తేలుతాయని పోలీసులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+