Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం... ఏప్రిల్ 20 నుంచి 2 వారాల పాటు...

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. భారత్‌తో పాటు ఆసియాలోని పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌ విమానాలపై కూడా నిషేధించింది. ఏప్రిల్ 20 నుంచి రెండు వారాల పాటు ఈ మూడు దేశాలకు విమాన రాకలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అంతేకాదు,ఆయా దేశాల్లో రెండు గంటలు

కరోనా విషయంలో ప్రస్తుతం ఈ మూడు దేశాలు అత్యంత హైరిస్క్‌లో ఉన్నాయని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన రెండు వారాల్లో విదేశాల నుంచి వచ్చినవారిలో చాలామందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. ఆదివారం(ఏప్రిల్ 18) నిర్దారణ అయిన 29 పాజిటివ్ కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో నమోదైనవేనని తెలిపింది. హాంకాంగ్‌లో ఇప్పటివరకూ 11,600 కరోనా కేసులు నమోదవగా.. 209 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 16-29 ఏజ్ గ్రూప్ వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని హాంకాంగ్ నిర్ణయించింది.

Hong Kong to ban flights from India, Pakistan and Philippines from 20 April

భారత్,పాకిస్తాన్,ఫిలిప్పీన్స్ దేశాల విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించిన నేపథ్యంలో... కాథే పసిఫిక్ (0293.హెచ్‌కె), హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, విస్టారా, సిబూ పసిఫిక్ (సిఇబిపిఎస్) విమాన సేవలు నిలిచిపోనున్నాయి.

కాగా,ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ 2లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెల క్రితం వరకు వందల్లో కేసులు నమోదైన చాలా రాష్ట్రాల్లో... ఇప్పుడు ఆ సంఖ్య వేలల్లోకి చేరింది. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆస్పత్రులన్నీ ఇప్పటికే కరోనా పేషెంట్లతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమవుతుండటంతో.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.

ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ దొరక్క చనిపోతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు దేశంలోని అన్ని పరిశ్రమలకు ఆక్సిజన్ సప్లైని నిషేధించి మెడికల్ అవసరాలకు వినియోగించాల్సిందిగా కేంద్రం తాజాగా ఆదేశాలిచ్చింది. కేవలం 9 పరిశ్రమలకు మాత్రం మినహాయింపునిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+