ఎన్డీయేకు నితీశ్ గుడ్ బై వెనుక ? మోడీ పాపులారిటీపై లోక్ నీతి సర్వే ఏం చెబుతోంది ?
బీహార్లో తాజాగా ఎన్డీయేకు గుడ్ బై చెప్పి మహాకూటమితో చేతులు కలిపిన నితీశ్ కుమార్ ఎనిమిదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్డీయేకు నితీశ్ గుడ్ బై చెప్పడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఇందులో బీజేపీ ఈసారి ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రధానంగా తెలుస్తోంది. అందులోనూ ప్రధాని మోడీకి బీహార్లో పెరుగుతున్న ఆదరణ దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని నిజమని నిరూపించే గణాంకాల్ని లోక్ నీతి సీఎస్డీఎస్ సర్వే బయటపెట్టింది.
2013 నుంచి 2021 వరకూ దేశవ్యాప్తంగా, అలాగే బీహార్లో ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను లోక్ నీతి సీఎస్ డీఎస్ సర్వే వెల్లడించింది. ఇందులో 2013లో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి 19 శాతంగా ఉన్న ఆదరణ కాస్తా 2021 నాటికి 44 శాతానికి పెరిగింది. అదే సమయంలో బీహార్లో 2013లో 23 శాతంగా ఉన్న ప్రధాని మోడీ ఆదరణ కాస్తా 2021 నాటికి ఏకంగా 53 శాతానికి పెరిగిపోయింది. తద్వారా దేశవ్యాప్తంగా మోడీకి పెరుగుతున్న ఆదరణతో పోలిస్తే బీహార్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధాని మోడీ ఆదరణ 2013 తర్వాత పలు ఒడిదొడుకులకు లోనైనట్లు లోక్ నీతి సీఎస్డీఎస్ సర్వే చెబుతోంది. 2013లో మోడీ ప్రధాని కాకముందు 19 శాతంగా ఉన్న ఆదరణ 2014లో అధికారం చేపట్టే నాటికి 36కి పెరిగింది. 2017 నాటికి ఇది 48 శాతానికి చేరుకుని ఆల్ టైమ్ హైగా నిలిచింది. ఆ తర్వాత 2018లో 37 శాతానికి పడిపోయింది. 2019లో తిరిగి 47 శాతానికి చేరుకున్నా 2021 నాటికి మాత్రం ఇది 44 శాతానికి పరిమితమైనట్లు లోక్ నీతి సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Popularity rating of Narendra Modi @LoknitiCSDS @CSDS surveys
— Sanjay Kumar (@sanjaycsds) August 11, 2022
ALL INDIA RATING
2021, 44%
2019, 47%
2018, 37%
2017, 48%
2014, 36%
2013, 19%
POPULARITY RATING IN BIHAR
2021, 53%
2019, 64%
2018, 48%
2017, 56%
2014, 44%
2013, 23%@Jduonline @RJDforIndia @BJP4India
Recommended Video

ఈ నేపథ్యంలో బీహార్లో మోడీ ఆదరణను సొమ్ము చేసుకుంటూ ఒంటరిగా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. నితీశ్ కు చుక్కలు చూపిస్తోంది. అవసరమైతే నితీశ్ పార్టీ జేడీయూను చీల్చేందుకు సైతం సిద్ధమైంది. దీన్ని గమనించిన నితీశ్.. ముందుగానే ఎన్డీయేకు గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications