H1B Visa షాక్: భారం..విద్యార్థులకా? టెక్కీలకా?: కీ పాయింట్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. H-1B వీసాలపై ఏటా 1,00,000 డాలర్ల ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. దీని ప్రభావం భారత్ పై తీవ్రంగా పడిందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే.. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సుమారు 71 శాతం మంది భారతీయులే.

వీరిలో ఎక్కువ మంది టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు అమెరికా ప్రాజెక్టులలో ఇంజనీర్లు, డెవలపర్‌లను నియమించుకోవడానికి ఈ వీసా ప్రోగ్రామ్‌పై చాలా కాలంగా ఆధారపడుతున్నాయి.

H1B Visa.. లక్ష డాలర్లే: కొంప ముంచావు కదయ్యా..!!

How the H-1B Visa Fee Hike Will Impact India Who Will Be Affected and What It Means for Professionals
  • ఈ ప్రొక్లమేషన్ ప్రకారం లక్ష డాలర్ల ఫీజు చెల్లించని నాన్ అమెరికన్ దరఖాస్తుదారుల పిటిషన్లను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తిరస్కరిస్తారు. ఈ కారణంగా- వాళ్లు పని చేస్తోన్న సంస్థ యాజమాన్యం ఈ మొత్తాన్ని చెల్లించిన అనంతరం దానికి సంబంధించిన రసీదులను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి అందజేయాలి. ప్రాసెసింగ్ సమయంలో స్టేట్ సెక్రటరీ దీన్ని అప్రూవ్ చేస్తారు.
  • ఈ నిబంధన వల్ల మధ్యస్థాయి నిపుణులు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు, కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారు అమెరికాలో ఉద్యోగం పొందడం కష్టతరం కావచ్చు. అలాగే- ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)లో ఉండే విద్యార్థులకు ఇది పెనుభారంగా మారుతుంది. ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది.
  • కొత్తగా ఉద్యోగాల్లో చేరిన భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు కూడా ఈ పెంపుదల శరాఘాతం. భారతీయులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. అమెరికాకు నిపుణులను పంపడంపై ఆధారపడే భారతీయ ఐటీ కంపెనీలప్లేస్‌మెంట్లలో తగ్గుదల చోటు చేసుకోవచ్చు. ఇది ఉద్యోగ అవకాశాలను మరింత క్లిష్టతరం చేస్తుంది.
  • అక్టోబర్ నుండి అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు కూడా సవరించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ ఎంక్వైరీలు కఠినతరం అయ్యాయి. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశం ప్రకారం, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా (B1/B2, H-1B, O-1, F1) దరఖాస్తుదారులు తమ నివాస దేశం నుండి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • హెచ్-1బీ వీసాలు కలిగిన ఐటీ ఉద్యోగుల వాటా 2003 ఆర్థిక సంవత్సరంలో 32 శాతంగా ఉండేది. అది ఇప్పుడు 65 శాతానికి పైగా పెరిగింది. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో అమెరికాలో 6.1 శాతం, కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 7.5 శాతం మేర నిరుద్యోగులు ఉన్నారు. దీన్ని నివారించడంలో భాగంగా అమెరికా ఈ ఫీజును పెంచింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+