రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక
సమ్మర్ హలీడేస్‌లో ఎక్కడెక్కడికి వెళ్దామా? అంటూ కుటుంబ సభ్యులంతా విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటుంటారు. బంధువులు, స్నేహితులు.. ఇలా అందరూ కలిసికట్టుగా వెళ్లేలా ప్రణాళికలు రచిస్తుంటారు. దూరంగా ఉండే ప్రాంతాలు, హిల్ స్టేషన్లు, మంచు కురిసే ప్రదేశాలను ఎంచుకుంటారు. అందరూ కలిసి భారీ సంఖ్యలో ఉంటారనుకున్నప్పుడు బస్సును మాట్లాడుకుంటారు. మరికొందరు రైలులో ఒక కోచ్ ను బుక్ చేసుకుంటారు. బస్సుకన్నా రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
దగ్గరైనా, దూరమైనా రైలు జర్నీయే..: ప్రజలు కూడా దగ్గరి ప్రాంతానికైనా, దూర ప్రాంతానికైనా రైలు ప్రయాణమంటేనే మక్కువ చూపిస్తుంటారు. అందరూ ఒకే కోచ్ లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల ఎంతదూరం ప్రయాణం చేసినా అలుపు అనేదే రాదు. రైలులో ఒక కోచ్ ను ఎలా బుక్ చేసుకోవాలి? దీనికి సంబంధించిన నియమాలు ఎలావున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గరిష్టంగా 2 కోచ్ లు: ముందుగా అనుమతి కోసం సంబంధిత రిజర్వేషన్ కార్యాలయం చీఫ్ రిజర్వేషన్ అధికారిని సంప్రదించాలి. బల్క్ అకామడేషన్‌ను కవర్ చేసే ఈ బుకింగ్‌లు ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌లో ఉదయం 10.00 గంటల తర్వాత నుంచి అందుబాటులో ఉంటాయి. FTR ద్వారా ఒకే రైలులో గరిష్టంగా 2 కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఒక టీమ్ FTR కింద గరిష్టంగా 24 కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. కనీస కోచ్ బుకింగ్ సంఖ్య 18.
సెక్యూరిటీ డిపాజిట్:ఆన్‌లైన్ ఫారమ్ ద్వారా బుకింగ్ పద్ధతి, ప్రయాణ వివరాలు, ప్రయాణ మార్గం, ఇతర సమాచారాన్ని చీఫ్ రిజర్వేషన్ అధికారికి అందించాలి. ఒక్కో క్యారేజీకి 50 వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. 18 కోచ్‌ల కంటే తక్కువ బుకింగ్ అయినప్పటికీ 18 కోచ్‌ల రిజిస్ట్రేషన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 6నెలలు ముందుగానే కోచ్ ని బుక్ చేసుకోవాలి. ప్రయాణం పూర్తయిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ వాపసు చేస్తారు. ఐఆర్ సీటీసీ క్యాటరింగ్ సేవలుంటాయి. పూర్తి వివరాలకు www.ftr.irctc.co.inని సందర్శించాలి.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications