వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను చంపి ..సూట్ కేసులో పెట్టాడు

అనుమానం పెనుభూతమైంది. బార్ డ్యాన్సర్ గా పనిచేసే భార్యకు వివాహేతర సంబంధాలున్నాయని భావించిన భర్త ఆమెను చంపాడు. శవాన్ని సూట్ కేసులో పెట్టి పారేసిందుకు స్నేహితుడు షఫీవుల్లా సహయాన్ని కోరాడు. అయితే షఫీవుల్

ఉల్లాస్ నగర్ :అనుమానం పెనుభూతమైంది. భార్య పై అనుమానం పెంచుకొన్నాడు భర్త,. కనీసం తన అనుమానాలు నిజమా...అబద్దమా రూఢీ చేసుకోలేదు. తన అనుమానాల ఆధారంగా పచ్చనిసంపారంలో నిప్పులుపోసుకొన్నాడు. కట్టుకొన్న భార్య కత్తితో పొడిచి చంపాడు. భార్య శవాన్ని సూట్ కేసులో పెట్టి మాయం చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.

మహరాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్లాస్ నగర్ లో రాజేష్ ఖాన్ నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య జమీల బార్ లో డ్యాన్స ర్ గా పనిచేస్తోంది. తన భార్యపై రాజేష్ ఖాన్ కు అనుమానం ఉంది. తన భార్య పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని అనుమానించాడు.

తన భార్యపై అనుమానాన్ని నివృత్తి చేసుకోలేదు. ఆమెను చంపడమే లక్ష్యంగా పెట్టుకొన్నాడు. బార్ లో డ్యాన్సర్ గా పనిచేస్తోన్న జమీల విధుల ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఆమెపై కత్తితో దాడి చేసి చంపాడు.

 husband murder his wife suspect illegal affair

తన భార్యను చంపేశాడు. కాని, శవాన్ని మాయం చేయడం ఎలాగో తెలియలేదు. భార్య శవాన్ని సూట్ కేసులో కుక్కాడు. ఈ సూట్ కేసును ఎవరికీ కనిపించకుండా బయట పారేయాలని భావించాడు. అయితే సూట్ కేసును మోసుకెళ్ళేందుకు మరొకరి సహయం కావాలని భావించాడు. ఈ మేరకు తన స్నేహితుడి సహయాన్ని అర్థించాడు.

తన భార్యను చంపివేసి శవాన్ని మాయం చేసేందుకు రావాల్సిందిగా తన స్నేహితుడు షఫీవుల్లాకు పోన్ చేశాడు. అయితే మాత్రం ఈ పనిచేసేందుకు సహయం చేయలేనని షఫీవుల్లా తెగేసి చెప్పాడు. తన స్నేహితుడు రాజేష్ భార్య హత్య చేశాడని షఫీవుల్లా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు రాజేష్ ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+