అసహజ శృంగారంతో భర్త టార్చర్: భరించలేక నవ వధువు ఆత్మహత్య..
భర్త చేసే అసహజ శృంగారాన్ని భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
నోయిడా: నోయిడాలో ఓ నవ వధువు ఆత్మహత్య కలకలం రేపింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. మీరట్ పట్టణానికి చెందిన దీపశిఖగా ఆమెను గుర్తించారు. భర్త చేసే అసహజ శృంగారాన్ని భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్ పట్టణానికి చెందిన దీపశిఖ అనే యువతికి నోయిడాలోని సెక్టార్ 78కు చెందిన సంజయ్ తో వివాహం జరిగింది. అయితే పడకగదిలో భర్త చేసే అసహజ శృంగారంతో ఆమె తీవ్ర వేదనను అనుభవించింది. ఆమె భర్త సంజయ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడని, ఆత్మహత్య సమయంలో అతను ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య సమయంలో ఆమె అత్త మాత్రం ఇంట్లోనే ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీపశిఖ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications