వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడిఎంకె:ఎన్నికల గుర్తు ఎవరికి దక్కునో, గత ఘటనలు పునరావృతమౌతాయా?

స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాది మే 14 లోపుగా పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.అయితే ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఎన్నికల గుర్తుపై ఎవరూ పోటీచేస్తారనే ఆసక్తి సర్వత్రా

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కోసం తమిళనాడులో రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి,.అయితే అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల గుర్తుపై ఎవరు పోటీచేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ ఏడాది మే 14వ, తేదిలోపుగా స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమౌతున్నాయి.

అయితే అధికార అన్నాడిఎంకె పార్టీ గ్రూపులుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఒక వర్గం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ నేతృత్వంలో మరో వర్గం ఉంది.

 I will tour in state after local body elections notification:panneer

అయితే పన్నీర్ సెల్వం నేతృత్వంలోని వర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఆకుల గుర్తుపైనే తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. శశికళ అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్ వర్గం ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడ ఇటీవలే రాజకీయ వేదికను ప్రారంభించారు. అన్నాడిఎంకెను తిరిగి దక్కించుకొనేందుకుగాను రాజకీయ వేదికను ఉపయోగించుకొంటున్నట్టుగా ఆమె ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు పన్నీర్ సెల్వం ప్రకటించారు.

English summary
I will tour in state after local body elections notification said Tamil Nadu former chief minister panneer selvam. we will contest with two leaves symbol in local body elections he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X