ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో 50 వేల మెజారిటితో విజయం సాధిస్తా:దినకరన్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:వచ్చే నెల 12వ, తేదిన తమిళనాడు రాష్ట్రంలోని ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె తరపున బరిలోకి దిగనున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణన్ తన విజయంపై ధీమాగా ఉన్నారు. ఈ స్థానం నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు.

ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికలకు అదికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని దినకరన్ ధీమాను వ్యక్తం చేశారు.

i will win in Rk nagar by elections: dinkaran

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో తాను 50 వేలపైగా ఓట్లతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు. అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది తన కోరికగా ఆయన చెప్పారు.

అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకే తాను ఉప ఎన్నికల బరిలో నిలిచినట్టు దినకరన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమకు డిఎంకె ప్రధాన ప్రత్యర్థి అని దినకరన్ చెప్పారు.ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఇంకా డిఎంకె అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
i will win in Rk nagar by election said aiadmk deputy general secretary dinkaran on wednes day.
Please Wait while comments are loading...