నగ్మా స్థానంలో నేనుంటే..: 'ఎమ్మెల్యే ముద్దు'పై ఖుష్బూ

చెన్నై: ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ మీరట్ లోకసభ అభ్యర్థి నగ్మా 'ముద్దు' ఘటన పైన ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ గురువారం స్పందించారు. ఈ సందర్భంగా ఖుష్బూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నగ్మాకు ఎదురైన ఘటన తనకు ఎదురైతే తాను ఏం చేసేదో చెప్పారు. నగ్మా స్థానంలో తాను ఉండి ఉంటే... తనకు ముద్దు పెట్టే ప్రయత్నం ఆ వ్యక్తి చేస్తే... చాచి చెంప పైన ఒక్కటి వేసే దానిని అని వ్యాఖ్యానించారు.

కాగా, ప్రముఖ నటి, ఉత్తర ప్రదేశ్‍లోని మీరట్ లోకసభ నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నగ్మా పట్ల అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

 నగ్మా - ఖుష్బూ

నగ్మా - ఖుష్బూ

కాగా, ప్రముఖ నటి, ఉత్తర ప్రదేశ్‍లోని మీరట్ లోకసభ నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నగ్మా పట్ల అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

నగ్మా - ఖుష్బూ

నగ్మా - ఖుష్బూ

సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనతో నగ్మా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్యే చర్యను మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

నగ్మా - ఖుష్బూ

నగ్మా - ఖుష్బూ

హపూర్ వచ్చిన నగ్మాను స్థానిక ఎమ్మెల్యే గజరాజ్ ఆహ్వానించారు. ఈ సమయంలో ఆయన అందరు చూస్తుండగానే చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు.

నగ్మా - ఖుష్బూ

నగ్మా - ఖుష్బూ

పబ్లిగ్గా ముద్దు పెట్టినట్లు ఆదివారం జోరుగా వార్తలు వచ్చాయి. అయితే, తన పైన చేయి వేసిన గజరాజ్ పైన నగ్మా ఆగ్రహించారు. ఆయన చేతిని తీసేశారు. ఆమె అక్కడ ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుదిరిగారు.

నగ్మా - ఖుష్బూ

నగ్మా - ఖుష్బూ

అయితే, ఆ తర్వాత నగ్మా ఈ ఘటనపై స్పందించారు. గజరాజ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. ఆయన తనను కూతురుగా చూస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+