Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిక్‌ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్‌....ఎప్పటి వరకో తెలుసా..?

ఢిల్లీ: పాకిస్తాన్ యుద్ద విమానాలన మిగ్-21 ఫైటర్ జెట్‌లో తరుముకుంటూ వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దురదృష్టవశాత్తు పాక్ సైన్యానికి పట్టుబడ్డాడు. ఆ తర్వాత పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో అభినందన్‌ను విడుదల చేయడం జరిగింది. ఇక మార్చి 1న భారత్ భూభాగంపై అడుగుపెట్టిన అభినందన్ ఆ తర్వాత కొన్ని వైద్యపరీక్షల కోసం అతన్ని ఓ ఆస్పత్రికి తరలించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఇక ఈ ప్రక్రియ ముగియడంతో అభినందన్‌ను సిక్ లీవ్ పై ప్రభుత్వం పంపింది. ఆర్మీ రీసెర్చ్ మరియు రిఫరల్ హాస్పిటల్ వైద్యుల సూచనల మేరకు అభినందన్‌ను మూడువారాలు పాటు సిక్ లీవ్ పై పంపింది ప్రభుత్వం.

పాకిస్తాన్ సైన్యంకు గతనెల అభినందన్ పట్టుబడటంతో ఆయన భారత్‌కు తిరిగి క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించారు.ఇక పాకిస్తాన్‌లో తనను మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని అభినందన్ చెప్పుకొచ్చారు. బంధీగా ఉండగా తనతో బలవంతంగా అన్నీ చెప్పించారని పలువురి ప్రముఖలతో అభినందన్ చెప్పాడు.

IAF braveheart Abhinandan Varthaman advised to go on sick leave after debriefing

ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత జవాన్లు ప్రయాణిస్తున్నకాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరపడంతో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకార చర్యగా.... భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్ పై వైమానిక దాడులు జరిపి అక్కడి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+