సేవింగ్స్ డిపాజిట్లపై భారీ షాక్
ICICI Bank: బ్యాంకులు.. కోత బాట పట్టాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో జాతీయ, ఇతర ప్రైవేట్ బ్యాంక్‌లన్నీ కూడా ఈ నిర్ణయాలను తీసుకుంటోన్నాయి. ఖాతాదారులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ మొత్తాలపై చెల్లిస్తోన్న వడ్డీ రేటును తగ్గిస్తోన్నాయి.
బ్యాంక్ వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఇటీవలే 25 బేసిస్ పాయింట్ల మేర కుదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025- 2026లో ఆర్బీఐ ప్రకటించిన మొట్టమొదటి మానిటరింగ్ పాలసీలోనే రెపొ రేట్ల తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు.. మున్ముందు ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయనేది చెప్పకనే చెప్పినట్టయింది.

దీని ప్రభావం బ్యాంకులపై పడింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) ఇప్పటికే తన సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్ వడ్డీరేటును తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఆ బ్యాంక్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పుడు తాజాగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అదే బాట పట్టింది. తన సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్ వడ్డీ రేటును 0.25 శాతానికి తగ్గించింది. ప్రైవేట్ సెగ్మెంట్‌లో రెండో అతిపెద్ద బ్యాంక్ ఇదే. ఐసిఐసిఐ బ్యాంక్ డిపాజిటర్లు తమ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌లపై 50 లక్షల రూపాయల వరకు 2.75 శాతం వడ్డీని పొందుతారు.
50 లక్షల రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై చెల్లించే వడ్డీ రేటులో కూడా కోత పెట్టినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. 0.25 శాతం కోతను దీనికీ వర్తింపజేసింది. 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండే సేవింగ్స్ మొత్తాలపై చెల్లించే వడ్డీరేటును 3.25 శాతానికి తగ్గించినట్లు వివరించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు నేడు అమలులోకి వచ్చాయి.
ప్రస్తుతం- దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ మొత్తాలపై 2.70 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. అన్ని జాతీయ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇంచుమించు ఇలాగే ఉంటోన్నాయి. రెపో రేటును ఆర్బీఐ తగ్గించిన ప్రభావం అటు టర్మ్ డిపాజిట్ రేటుపైనా పడింది. దీనికి సంబంధించిన ఆఫర్లను కుదిస్తూ వస్తోన్నాయి బ్యాంకులు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications