రైలులో లోయర్ బెర్త్ కావాలంటే ఇలా చేయండి!
తరుచుగా రైలు ప్రయాణం చేసేవారు బెర్తుల పరంగా పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. కోరుకున్న బెర్త్ లభించక, అందులో సర్దుకుపోలేక, నిద్ర లేక బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణం రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు అందరూ లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు. అయితే మొదటిగా లోయర్ బెర్త్ లను వయసు ప్రాతిపదికగా సీనియర్ సిటిజన్లకు ఇస్తారు.
కొన్నికొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్తులు దొరక్క అనేక అవస్థలను ఎదుర్కొంటుంటారు. రైల్వేను లోయర్ బెర్త్ కోసం రిక్వెస్ట్ చేసినా దొరకని పరిస్థితులే ఉంటాయి. చేసే ప్రయాణం కష్టతరమవుతుంది. అయితే ఇకనుంచి లోయర్ బెర్త్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా తేలికగా ఈ బెర్తును రిజర్వు చేసుకోవచ్చు. ఒక ప్రయాణికుడు తాను టికెట్ బుక్ చేసిన రైలులో 102 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ లోయర్ బెర్త్ ఇవ్వకుండా మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ఇచ్చారంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్యాగ్ చేశారు. తర్వాత IRCTC దీనిపై స్పందించింది.

సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికోసం లోయర్ బెర్తులు కేటాయించామని, 45 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ వయసున్న మహిళకు ఈ బెర్తులను ఇస్తారు. వీరిలో ఎవరైనా ఒంటరిగా లేదా ఇద్దరుగా ప్రయాణించినా.. వారికి లోయర్ బెర్తులను సిస్టమ్ ఇస్తుంది. ఒకవేళ మీరు బుక్ చేసే రెండు టికెట్లలో ఏ ఒక్కరూ సీనియర్ అవ్వకపోతే వారికి లోయర్ బెర్తు ఇవ్వరని IRCTC ట్వీట్ చేసింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం 45సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి లోయర్ బెర్త్ వచ్చేలా సిస్టమ్ లో ఫీడ్ చేసివుంటుంది. కుటుంబం మొత్తం కలిసి ప్రయాణించాలి అనుకున్నప్పడు వృద్ధుల కోసం అందరితో కాకుండా సెపరేటుగా టికెట్ బుక్ చేయడం మంచిది.












Click it and Unblock the Notifications