చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీరంగం ట్రిపుల్ ఐటి మూసివేత: రోడ్డునపడ్డ విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలోని శ్రీరంగం ఐఐఐటీ బుధవారం నుంచి నిరవధికంగా మూతపడింది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ప్రకటించింది. దీంతోపాటు విద్యార్థులు తక్షణమే హాస్టల్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఐఐఐటీ స్థాయిలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయల కల్పనలో యాజమాన్య వైఖరికి నిరసనగా గత వారం రోజులుగా విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఫలితంగా హాస్టళ్లలో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ జిల్లాల విద్యార్థులు ఉన్నారు.

కాగా, విద్యార్ధులు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో తిరుచ్చిలోని బిట్‌ క్యాంపస్‌లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న శ్రీరంగం ట్రిపుల్‌ ఐటీని నిరవధికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టర్‌ డా. టి సెంథిల్‌ కుమార్‌ ప్రకటించారు. కాలేజీ ప్రతిష్టకు భంగకరంగా విద్యార్థుల ప్రవర్తన ఉందని.. ఇంతరకుమించి తమకు వేరేదారి లేదని చెప్పారు.

 IIIT Srirangam Shut Indefinitely After Stir

ఒకవైపు శాంతి చర్చలంటూ ఆహ్వానించి, మరోవైపు యాజమాన్యం గైర్హాజరవ్వడంతోపాటు ఆందోళన విరమించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికిప్పుడు హాస్టళ్లను ఖాళీ చేయమని ఆదేశించడం అప్రజాస్వామికమని, తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు చెబుతున్నారు.

ఈ విషయంలో మానవవనరుల శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2013లో శ్రీరంగం ఎంటెక్ కోర్సుతో ఐఐఐటీని ప్రారంభించింది. అప్పటి నుంచి తిరుచ్చి-పుదుక్కోట రోడ్‌లోని అన్నా వర్సిటీ బిట్‌ క్యాంపస్‌లో అరకొర వసతులతో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు.

కాగా, త్వరలో శ్రీరంగంలో సంస్ధ నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అయితే తొలి సెమిస్టర్ పరీక్షలు పూర్తైనా , భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ గత వారం రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐఐటీని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
After a week-long hunger strike by its students, the management of the Indian Institute of Information Technology (IIIT), Srirangam here on Wednesday, has closed all its first year classes indefinitely and has asked the students to vacate the hostels immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X