వినూత్నం: ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్ధి
బెంగుళూరు: ఉద్యోగం కోసం బయోడేటాను తయారు చేయడం బోరింగ్‌గా ఉంటుంది. అంతేకాదు ఆ బయేడేటాతో పాటు అర్హత పత్రాలను ఉద్యోగార్దులు చేతపట్టుకుని కంపనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్ధి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు.
దీంతో ఇప్పుడతను అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. అదే వెబ్‌సైట్‌లోనే తనని తాను అమ్మకానికి ఉన్నానంటూ రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేశాడు.

వివరాల్లోకి వెళితే... ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చదువుతున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. వెబ్‌సైట్‌లో తనని తాను అమ్మకానికి ఉంచినట్లు ప్రొపైల్‌తో పాటు పూర్తి వివరాలను పొందుపరిచాడు. అంతేకాదు తనకు ఇచ్చే వేతనాన్ని కూడా ఫిక్స్ చేశాడు.
రూ. 27,60,200గా తన ధరను నిర్ణయించుకున్న నీరజ్ మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్‌ను కూడా ప్రకటించాడు. భారత్‌లోని మేధావులతో పోటీ పడినప్పుడు, మిగతావారితో పోల్చినప్పుడుఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు.
ఎంతో కొత్తగా ఆలోచించిన మిట్టల్‌కు ఫ్లిప్‌కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎటువంటి ఇంటర్యూ కాల్ మిట్టల్‌కు రాకపోవడం విశేషం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications