Illegal affair: బస్సులో భార్యతో షికారుకు వెలుతున్న ప్రియుడు, నిలబెట్టి నరికేసిన మొగుడు !
బెళగావి/ బెంగళూరు: దంపతుల మద్య పక్కనోడు చిచ్చు పెట్టాడు. భర్తతో హ్యాపీగా సంసారం చేసుకుంటున్న భార్యను లైన్ లో పెట్టాడు. ఫోజులు కొడుతున్న కుర్రాడిని చూసి భార్య కూడా అతని మీద మోజుపడింది. ఆహా ఓహో అంటూ వెంటతిరుగుతున్న యువకుడికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వివాహిత మహిళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి పోటుగాడు ఆమె ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ భర్తను నిర్లక్షం చేసి అతనితో మస్త్ మజా చేసింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రియుడితో కలిసి బస్సులో రహస్య ప్రాంతానికి తన భార్య వెలుతోందని భర్తకు తెలిసిపోయింది. బైక్ లో బస్సును వెంబడించిన భర్త మార్గం మధ్యలో బస్సు నిలిపేసి వేటకొడవలి తీసుకుని అతని భార్యను అందరి ముందు నరికేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని బెళగావిలో ప్రవీణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వందనా అనే మహిళను ప్రవీణ్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ప్రవీణ్, వందనా దంపతులు సంతోషంగా కాపురం చేశారని తెలిసింది. సంతోషంగా కాపురం చేసుకుంటున్న ప్రవీణ్, వందనా దంపతుల మద్య తరువాత సమస్యలు మొదలైనాయి.

కుర్రాడి ఎంట్రీతో సీన్ రివర్స్
ప్రవీణ్, వందనా దంపతుల మద్య సంతోష్ అనే యువకుడు చిచ్చు పెట్టాడు. భర్త ప్రవీణ్ తో హ్యాపీగా సంసారం చేసుకుంటున్న భార్య వందనాను సంతోష్ అనే యువకుడు లైన్ లో పెట్టడానికి ప్రయత్నించాడు. భర్త ప్రవీణ్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య వందనా ఇంటిలోనే ఉంటున్నది. ఫోజులు కొడుతున్న కుర్రాడు సంతోష్ ను చూసి వందనా కూడా అతని మీద మోజుపడింది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన భార్య
ఆహా ఓహో అంటూ వెంటతిరుగుతున్న సంతోష్ కు ప్రవీణ్ భార్య వందనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వివాహిత మహిళ వందనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి పోటుగాడు సంతోష్ ఆమె ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. భర్త ప్రవీణ్ బయటకు వెళ్లిన తరువాత సంతోష్ ను ఇంటికి పిలిపించుకుంటున్న వందనా అతనితో ఎంజాయ్ చేసింది.

బెడ్ రూమ్ వదిలి బయటకు రాలేదు
ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న ప్రవీణ్ వ్యాపారం ముగించుకుని రాత్రి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నాడు. ఉదయం భర్త ప్రవీణ్ బయటకు వెళితే రాత్రి వరకు ఇంటికి తిరిగిరాడని అతని భార్య వందనాకు బాగా తెలుసు. పగలు ప్రియుడు సంతోష్ ను నేరుగా ఇంటికే పిలిపించుకుంటున్న వందనా ఇద్దరూ బెడ్ రూమ్ కే అంకితం అయిపోతున్నారని చుట్టుపక్కల వారికి తెలిసిపోయింది.

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త
ప్రియుడు సంతోష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న వందనా ఆమె భర్త ప్రవీణ్ ను నిర్లక్షం చేసింది. ప్రియుడు సంతోష్ తో వందనా మస్త్ మజా చేస్తూ కాలం గడిపింది. భార్య వందనా అక్రమ సంబంధం గురించి ఆమె భర్త ప్రవీణ్ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని పదేపదే ప్రవీణ్ అతని భార్యను హెచ్చరించాడు. ప్రవీణ్ వార్నింగ్ ఇచ్చినా అతని భార్య వందనా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

భర్తకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన భార్య
ప్రియుడు సంతోష్ తో ఎంజాయ్ చేస్తున్న వందనా ఆమె భర్త ప్రవీణకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. వందనాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆమె భర్త ప్రవీణ్ అనేక ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని తెలిసింది. భర్త ప్రవీణ్ కు మ్యాటర్ లీక్ అయిన తరువాత వందనా ఇంటిలో కాకుండా ప్రియుడు సంతోష్ తో ఎంజాయ్ చెయ్యడానికి రహస్య ప్రాంతాలకు మర్చేసింది.

భార్యను చంపేయాలని డిసైడ్ అయిన భర్త
ఎంత చెప్పినా తన భార్య వందనా తీరు మార్చుకోలేదని ప్రవీణ్ రగిలిపోయాడు. వందనా విషయంలో విసిగిపోయిన ఆమె భర్త ప్రవీణ్ ఆమెను చంపేయాలని ఇటీవల డిసైడ్ అయ్యాడు. ప్రియుడు సంతోష్ కలిసి వందనా సంకేశ్వర నుంచి బస్సులో రహస్య ప్రాంతానికి తన భార్య వెలుతోందని ఆమె భర్త ప్రవీణ్ కు తెలిసిపోయింది.

బస్సు నిలబెట్టి భార్యను నరికేసిన భర్త
బైక్ లో బస్సును వెంబడించిన ప్రవీణ్ మార్గం మధ్యలో బాడ గ్రామం సమీపంలో బస్సు నిలిపేశాడు. వేటకొడవలి తీసుకున్న ప్రవీణ్ అతని భార్య వందనాను ఇష్టం వచ్చినట్లు అందరి ముందు నరికేశాడు. తీవ్రగాయాలైన వందనాను బెళగావిలోని బీమ్స్ ఆసుపత్రికి తరలించారు. వందనా పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. వందనాను దారుణంగా నరికేసిన ఆమె భర్త ప్రవీణ్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా భార్య వందనాను ఆమె భర్త ప్రవీణ్ బస్సులో నుంచి కిందకు దించి నరికేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications