Illegal affair: రాత్రి భర్త పక్కరూమ్ లో ఉంటే ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య, సీన్ కట్ చేస్తే, ఫినిష్!

బరేలి/న్యూఢిల్లీ: దూరపు బంధువులు అయిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. దూరపు బంధువులు కావడం, యువతి, యువకుడు ప్రేమించుకోవడంతో పెద్దలు వారి పెళ్లి జరిపించారు. సంతోషంగా కాపురం చేసిన దంపతులు ఓ కొడుక్కి తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు పుట్టిన తరువాత భార్య మరో వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుందని ఆరోపిస్తూ భర్త ఆమెను వదిలేశాడు. భర్తకు దూరంగా ఉంటున్న భార్య బ్యూటీపార్లల్ లో ఉద్యోగం చేస్తోంది.

భర్ద దగ్గర ఉంటున్న కొడుకును పిలుచుకుని వెళ్లడానికి ఆమె భర్త ఇంటికి వెళ్లింది. రాత్రి పొద్దుపోయిన తరువాత విడిపోయిన భర్త పక్కరూమ్ లో ఉంటే మరోరూమ్ లో ఉన్న భార్య ఆమె ప్రియుడికి వీడియో కాల్ చేసి మాట్లాడుతోంది. ఆ సందర్బంలో భార్య రూమ్ లోకి వెళ్లిన భర్త రగిలిపోయాడు. వీడియో కాల్ లో ప్రియుడితో మాట్లాడుతూ బిజీగా ఉన్న భార్యను చంపేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

 ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి

ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని ఘన్ సూర్ పూర్ గ్రామంలో మోహమ్మద్ షాన్ వాజ్ అలియస్ షాన్ వాజ్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఢిల్లీలోని ముస్కాన్ (25) అనే యువతి నివాసం ఉంటున్నది. షాన్ వాజ్, ముస్కాన్ దూరపు బంధువులు. ఐదు సంవత్సరాల క్రితం షాన్ వాజ్, ముస్కాన్ ప్రేమించుకున్నారు.

కొడుకు పుట్టిన తరువాత తేడాలు

కొడుకు పుట్టిన తరువాత తేడాలు

దూరపు బంధువులు కావడం, షాన్ వాజ్, ముస్కాన్ ప్రేమించుకోవడంతో విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు నాలుగు సంవత్సరాల క్రితం వారి పెళ్లి జరిపించారు. భర్త షాన్ వాజ్ ఇంటికి ముస్కాన్ వెళ్లింది. సంతోషంగా కాపురం చేసిన షాన్ వాజ్, ముస్కాన్ దంపతులు ఓ కొడుక్కి తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు పుట్టిన తరువాత ఇద్దరి మద్య తేడాలు వచ్చాయి.

భార్యకు అక్రమ సంబందం ఉందని వదిలేశాడు

భార్యకు అక్రమ సంబందం ఉందని వదిలేశాడు

కొడుకు పుట్టిన తరువాత తన భార్య ముస్కాన్ మరో వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుందని ఆమె భర్త షాన్ వాజ్ కు తెలిసిపోయింది. భార్య ముస్కాన్ ను ఇంటి నుంచి తన్ని తిరిమేసిన షాన్ వాజ్ అతని కొడుకును మాత్రం అతని దగ్గరరే పెట్టుకున్నాడు. ఢిల్లీలోని పుట్టింటిక వెళ్లిపోయి భర్తకు దూరంగా ఉంటున్న ముస్కాన్ ఢిల్లీలోని ఓ బ్యూటీపార్లల్ లో ఉద్యోగం చేస్తోంది.

భర్త పక్కరూమ్ లో ఉంటే ప్రియుడికి వీడియో కాల్ చేసింది

భర్త పక్కరూమ్ లో ఉంటే ప్రియుడికి వీడియో కాల్ చేసింది

భర్ద షాన్ వాజ్ దగ్గర ఉంటున్న కొడుకును పిలుచుకుని వెళ్లడానికి మూడు రోజుల క్రితం ముస్కాన్ ఘన్ సూర్ పూర్ లోని ఆమె భర్త ఇంటికి వెళ్లింది. రెండు రోజులు ముస్కాన్ ఆమె భర్త ఇంటిలోనే ఉంది. రాత్రి 10.30 గంటల సమయంలో విడిపోయిన భర్త షాన్ వాజ్ పక్కరూమ్ లో ఉంటే మరోరూమ్ లో ఉన్న ముస్కాన్ ఆమె ప్రియుడికి వీడియో కాల్ చేసి మాట్లాడుతోంది.

భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

ఆ సందర్బంలో భార్య ముస్కాన్ రూమ్ లోకి వెళ్లిన షాన్ వాజ్ ఆమె వీడియో కాల్ లో మాట్లాడుతున్న విషయం గమనించి రగిలిపోయాడు. వీడియో కాల్ లో ప్రియుడితో మాట్లాడుతూ బిజీగా ఉన్న భార్య ముస్కాన్ ను గొంతు నులిమి చంపేసిన భర్త షాన్ వాజ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నా భార్య ముస్కాన్ అక్రమ సంబందం పెట్టుకుని మా ఇంటి పరువు తీసిందని, ఇప్పుడు మా ఇంటికే వచ్చి ప్రియుడికి వీడియో కాల్ చేసిందని, అందుకే చంపేశానని షాన్ వాజ్ చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+