Illegal affair:భర్త ఆఫీసుకు వెళ్లిన వెంటనే భార్య అందంగా ?, ఎక్కడంటే అక్కడ పొడిచి చంపిన భర్త!
పూణే/ముంబాయి/ చెన్నై: వివాహం చేసుకుని చక్కగా భార్యతో కాపురం చేసి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అనుకున్న యువకుడి జీవితం తారుమారు అయ్యింది. ఇంట్లో చూసిన యువతిని వివాహం చేసుకున్న యువకుడు సిటీలో కాపురం పెట్టి ఉద్యోగం చేస్తున్నాడు. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య చాలా అందంగా తయారౌతున్నది. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య ఎందుకు అంత అందంగా తయారౌతున్నది ? అని భర్తకు అనుమానం మొదలైయ్యింది. నా భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది.
సంవత్సరం నుంచి దంపతుల మద్య అక్రమ సంబంధం విసషయంలో గొడవలు జరగడం, గొడవ పడుతున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమె మళ్లీ భర్త ఇంటికి రావడం ఇలా డైలీ సీరియల్ లాగా సాగిపోయింది. భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయి రెండు రోజుల క్రితమే మళ్లీ భర్త ఇంటికి తిరిగి వచ్చింది. తన భార్య ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి చీటికిమాటికి పుట్టింటికి వెలుతోందని రగిలిపోయిన భర్త పదునైన ఆయుధంతో భార్య ముఖం, తల, మెడ మీద తదితర చోట్లు దారుణంగా పొడిచి హత్య చెయ్యడం కలకలం రేపింది.

సంతోషంగా పెళ్లి చేసుకున్న యువకుడు
మహారాష్ట్రలోని పూణే సిటీలోని పింప్రీ-చించ్ వాడా శాటిలైట్ ఏరియాలోని హింజవాడిలో రాహుల్ గోకుల్ ప్రతాప్ అలియాస్ గోకుల్ అలియాస్ రాహుల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం రాహుల్ ఇంట్లో చూసిన గౌరి (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గౌరీని వివాహం చేసుకున్న రాహుల్ ఆమెతో కొంతకాలం చాలా సంతోపంగా జీవించాడు.

సెక్యూరిటీ గార్డు ఉద్యోగం
రాహుల్, గౌరీ దంపతులు హింజవాడిలోనే నివాసం ఉంటున్నాడు. శాటిలైట్ సిటీలో రాహుల్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తన్నాడు. ఇంట్లో చూసిన గౌరీని వివాహం చేసుకున్న రాహుల్ పూణే సిటీలో కాపురం పెట్టి ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. కొంతకాలం గౌరీ కూడా ఆమె భర్త రాహుల్ తో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగానే ఉండేది.

నా భార్య ఎందుకు అందంగా రెఢీ అవుతోంది ?
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న గౌరీ ఆమె భర్త రాహుల్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత చాలా అందంగా తయారౌతున్నది. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య గౌరీ ఎందుకు అంత అందంగా తయారౌతున్నదని ఆమె భర్త రాహుల్ కు అనుమానం మొదలైయ్యింది. ప్రతిరోజూ ఇంటికి వెళ్లే సమయానికి గౌరీ అందంగా సింగారించుకుని కనపడటంతో ఆమె భర్త రాహుల్ రానురాను ఇంకా అనుమానం ఎక్కువైపోయి ఇంకా అనుమానం పెంచుకున్నాడు.

గొడవలు ముదరిపోయాయి
నా భార్య గౌరీ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త రాహుల్ కు తెలిసిపోయింది. సంవత్సరం నుంచి రాహుల్, గౌరీ దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు జరగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఇద్దరి తీరు మారలేదు. భర్త రాహుల్ తో గొడవ పడుతున్న గౌరీ ఆమె పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమె మళ్లీ భర్త ఇంటికి రావడం ఇలా డైలీ సీరియల్ లాగా సాగిపోయింది.

నచ్చచెప్పి విసిగిపోతున్న భర్త
పదేపదే పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య గౌరీకి నచ్చచెప్పి ఇంటికి పిలుచుకుని వస్తున్న రాహుల్ ఆమె తీరుతో విసిగిపోయాడు. ఉద్యోగం చేస్తున్న చోట ప్రశాంతంగా ఉండలేకపోతున్న రాహుల్ అక్కడ పై అధికారుల దగ్గర చివాట్లు తింటూ వస్తున్నాడు. తన భార్య గౌరీని ఏదో ఒకటి చేస్తే తప్పా తాను ప్రశాంతంగా ఉండలేదనని రాహుల్ డిసైడ్ అయ్యాడు.

రెండు రోజుల ముందే పుట్టింటి నుంచి వచ్చిన భార్య
భర్త రాహుల్ తో ఎప్పటిలాగే గొడవపడిన గౌరీ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చచెప్పడంతో మంగళవారం రాత్రి గౌరీ మళ్లీ ఆమె భర్త రాహుల్ దగ్గరకు వెళ్లింది. రాత్రి 9. 30 గంటల సమయంలో ఇంటి బయట రాహుల్, గౌరీ దంపతుల మద్య గొడవ జరిగింది. చుట్టుపక్కల వాళ్లు చివాట్లు పెట్టడంతో రాత్రి రాహుల్, అతని భార్య గౌరీ ఇంట్లోకి వెళ్లిపోయారు.

భార్యను దారుణంగా చంపేసిన భర్త
ఆ రాత్రి సైలెంట్ గా ఉండిపోయిన రాహుల్ మరుసటి రోజు మళ్లీ అతని భార్య గౌరీతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోంది. తరువాత సహనం కోల్పోయిన రాహుల్ పదునైన కత్తి తీసుకుని అతని భార్య గౌరీ తల మీద, మెడ మీద, గొంతులో దారుణంగా పొడిచి చంపేశాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భార్య గౌరీని హత్య చేసిన ఆమె భర్త రాహుల్ ను అరెస్టు చేశారు. రాహుల్ మీద హత్య కేసు నమోదు చేసి అతన్ని పోలీసు అధికారులు విచారణ చేశారు.

నన్నే మోసం చేసింది.... చంపేశాను
తన భార్య గౌరీ వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిలువునా మోసం చేసిందని, అందుకే ఆమెను హత్య చేశానని రాహుల్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. కోర్టు అనుమతితో ఐదు రోజులు రాహుల్ ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని హింజవాడి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ బాలక్రిష్ణన్ సావంత్ స్థానిక మీడియాకు చెప్పారు.
గౌరీ హత్య కేసులో అల్లుడు రాహుల్ మీద ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారని హింజవాడి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ బాలక్రిష్ణన్ సావంత్ అన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో భార్య గౌరీ చాలా అందంగా తయారై ఉండటం వలనే రాహుల్ కు మొదట అనుమానం వచ్చిందని, తరువాత ఆమె అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిందని, ఇదే విషయంలొ గొడవలు ఎక్కువ అయ్యి ఆమె హత్యకు దారి తీసిందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications