Illegal affair: నా భార్య నాకు పడక సుఖం ఇవ్వకుండా ప్రియుడికి మాత్రం ?, స్పాట్ లో నరికి చంపేసి ?, క్లైమాక్స్ !

చెన్నై/ దిండిగల్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతుల మద్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది. భార్య ఎక్కువగా బయటకు వెళ్లి వస్తుండటంతో ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనకు పడక సుఖం ఇవ్వడం లేదని, నా భార్య మాత్రం ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని భర్త రగిలిపోయాడు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్లిన భార్యను ఎక్కడికి వెళ్లావు ? అని భర్త ప్రశ్నించాడు. ఆ సందర్బంలో భార్య ఏదో సమాధానం చెప్పడంతో రగిలిపోయిన భర్త కొడవలి తీసుకుని ఆమెను స్పాట్ లో నరికి చంపేయడం కలకలం రేపింది.

వయసులో 10 ఏళ్ల తేడా

వయసులో 10 ఏళ్ల తేడా

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని వత్తలకుండ సమీపంలోని గున్నువారన్ కోటలో చెల్లాపాండి అలియాస్ పాండి (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అంజులక్ష్మీ (36) అనే మహిళను చెల్లాపాండి పెళ్లి చేసుకున్నాడు. చెల్లాపాండి, అంజులక్ష్మిల వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.

దంపతుల మద్య గొడవలు

దంపతుల మద్య గొడవలు

వివాహం చేసుకున్న చెల్లాపాండి, అంజులక్ష్మి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. చెల్లాపాండి, అంజులక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు, కొడుకు పుట్టిన తరువాత చెల్లాపాండి, అంజులక్ష్మి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతుల మద్య వయసులో చాలా తేడా ఉండటంతో గొడవలకు అదీ ఒక కారణం అయ్యింది.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం


ఇటుకలు తయారు చేసే ఫ్యాక్టరీలో చెల్లాపాండి పని చేస్తున్నాడు. భార్య అంజులక్ష్మి ఎక్కువగా బయటకు వెళ్లి వస్తుండటంతో ఆమె భర్త చెల్లాపాండికి అనుమానం మొదలైయ్యింది. నా భార్య అంజులక్ష్మి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెల్లాపాండి అనుమానం పెంచుకుని మద్యం సేవించడానికి బానిస అయ్యాడు.

ప్రియుడికి పడక సుఖం ఇస్తోంది

ప్రియుడికి పడక సుఖం ఇస్తోంది

ప్రియుడి మోజులో పడిన తన భార్య అంజులక్ష్మి తనకు ద్రోహం చేస్తోందని, అందుకే తనకు పడక సుఖం ఇవ్వడం లేదని, నా భార్య మాత్రం ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని చెల్లాపాండి రగిలిపోయాడు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్లిన భార్య అంజులక్ష్మిని ఎక్కడికి వెళ్లావు ? అని చెల్లాపాండి ప్రశ్నించాడు. ఆ సందర్బంలో దంపతుల మద్య గొడవ జరిగింది.

భార్యను స్పాట్ లో నరికి చంపేసి లొంగిపోయిన భర్త

భార్యను స్పాట్ లో నరికి చంపేసి లొంగిపోయిన భర్త

అంజులక్ష్మి నిర్లక్షంగా ఏదో సమాధానం చెప్పడంతో రగిలిపోయిన చెల్లాపాండి కొడవలి తీసుకుని ఆమెను స్పాట్ లో నరికి చంపేశాడు. భార్య అంజులక్ష్మిని నరికి చంపేసిన చెల్లాపాండి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నా భార్యను నరికి చంపేశాను, వెళ్లి శవం తెచ్చుకోండి అంటూ చెల్లాపాండి కూల్ గా చెప్పాడంతో పోలీసులు హడలిపోయారు. అక్రమ సంబంధం కారణంగా చెల్లాపాండి అతని భార్య అంజులక్ష్మిని నరికి చంపేయడం దిండుగల్ జిల్లాలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+