చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, మిస్ డ్ కాల్ తో భర్తను చంపించిన భార్య, స్కెచ్ రివర్స్, ఢమాల్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/తేన్ కాశీ: వివాహం నిశ్చయం చేసే సమయంలోనే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటూ యువతి, యువకుడిని పెద్దలు అడిగారు. పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని ఇద్దరూ చెప్పడంతో యువతి, యువకుడి పెళ్లి జరిగిపోయింది. దంపతులు కాపురం చేస్తున్నారు. భర్త ఇంటిలోనే భార్య నివాసం ఉంటున్నది. దంపతులు ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సొంతగ్రామంలో నివాసం ఉంటున్న దంపతులు ఇద్దరూ ఉదయం ఒకే బైక్ లో ఉద్యోగానికి వెళ్లి రాత్రి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నారు. సాయంత్రం ఉద్యోగం ముగించుకున్న దంపతులు బైక్ లో ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో దంపతులను అడ్డగించిన కొందరు భర్త మీద దాడి చేసి అతన్ని చంపేశారు. భార్య దగ్గర ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. చినిగిపోయిన దుస్తులతో భర్త శవం పక్కన కుర్చున్న భార్య ఆర్తనాదాలు చేసింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారని, తన బంగారు గొలుసు లాక్కొన్నారని, అడ్డుపడిన తన భర్తను చంపేశారని భార్య పోలీసులకు చెప్పింది. అయితే భార్య స్వయంగా మిస్ డ్ కాల్ ఇవ్వడం వలనే కొందరు వెళ్లి ఆమె భర్తను హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

First Night: నా భార్య ఎక్కడంటే అక్కడ కొరికేసింది, చంద్రముఖి సినిమా చూపిస్తోంది, మీరే కాపాడండి, కేసు!First Night: నా భార్య ఎక్కడంటే అక్కడ కొరికేసింది, చంద్రముఖి సినిమా చూపిస్తోంది, మీరే కాపాడండి, కేసు!

 పెళ్లి గురించి చర్చలు

పెళ్లి గురించి చర్చలు

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని శంకర్ కోవిల్ పట్టణం సమీపంలోని సంతనిలింగపురంలో వైరస్వామి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వైరస్వామి, ముత్తుమారియమ్మ అలియాస్ ముత్తుమారి అనే యువతికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. కొంతకాలం ముత్తుమారి, వైరస్వామి కుటుంబ సభ్యులు పెళ్లి విషయం గురించి చర్చించుకున్నారు.

 పెళ్లి జరిగిపోయింది

పెళ్లి జరిగిపోయింది

వివాహం నిశ్చయం చేసే సమయంలోనే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటూ వైరస్వామి, ముత్తుమారిని పెళ్లి పెద్దలు అడిగారు. పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని ఇద్దరూ చెప్పడంతో ముత్తుమారి, వైరస్వామిల పెళ్లి జరిగిపోయింది. వివాహం జరిగిన తరువాత ముత్తుమారి, వైరస్వామి దంపతులు కాపురం చేస్తున్నారు.

 ఒకే కంపెనీలో దంపతుల ఉద్యోగం

ఒకే కంపెనీలో దంపతుల ఉద్యోగం

భర్త వైరస్వామి ఇంటిలోనే అతని భార్య ముత్తుమారి నివాసం ఉంటున్నది. వైరస్వామి, ముత్తుమారి దంపతులు ఇద్దరూ వీరశిఖామణి అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సొంతగ్రామంలో నివాసం ఉంటున్న వైరస్వామి, ముత్తుమారి దంపతులు ఇద్దరూ ఉదయం ఒకే బైక్ లో ఉద్యోగానికి వెళ్లి రాత్రి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నారు. సాయంత్రం ఉద్యోగం ముగించుకున్న వైరస్వామి, ముత్తుమారి దంపతులు బైక్ లో ఇంటికి బయలుదేరారు.

 భర్త దారుణ హత్య

భర్త దారుణ హత్య

మార్గం మద్యలో వైరస్వామి, ముత్తుమారి దంపతులను కారులో వెళ్లిన కొందరు అడ్డగించి వైరస్వామి మీద కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి అతన్ని చంపేశారు. ముత్తుమారి దగ్గర ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. చినిగిపోయిన దుస్తులతో ముత్తుమారి ఆమె భర్త వైరస్వామి శవం పక్కన కుర్చున్న ఆర్తనాదాలు చేసింది. అటువైపు వెలుతున్న స్థానికులు విషయంగుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 నాటకాలు ఆడిన కిలాడీ భార్య

నాటకాలు ఆడిన కిలాడీ భార్య

స్థానికులు సమాచారం ఇవ్వడంతో హత్య జరిగిన ప్రాంతానికి పోలీసుల వెళ్లారు. తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారని, తన బంగారు గొలుసు లాక్కొన్నారని, అడ్డుపడిన తన భర్త వైరస్వామిని చంపేశారని అతని భార్య ముత్తుమారి పోలీసులకు చెప్పింది. భార్య డ్రామా ఆడటంతో పోలీసులు మొదట నమ్మేశారు.

 హంతకుడిని పట్టించిన భార్య మిస్ డ్ కాల్

హంతకుడిని పట్టించిన భార్య మిస్ డ్ కాల్

పోలీసులు వైరస్వామి, అతని భార్య ముత్తుమారి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. వైరస్వామి హత్యకు గురైన కొంతసేపటి క్రితం అతని భార్య ముత్తుమారి ఇసాక్ ముత్తు అనే వ్యక్తికి మిస్ డ్ కాల్ ఇచ్చిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇసాక్ ముత్తును అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

 పెళ్లికి ముందే అక్రమ సంబంధం

పెళ్లికి ముందే అక్రమ సంబంధం

వైరస్వామిని పెళ్లి చేసుకోకముందు నుంచే ముత్తుమారి, నేనే శారీరక సంబంధం పెట్టుకున్నామని ఇసాక్ ముత్తు పోలీసులకు చెప్పాడు. వివాహం జరిగిన తరువాత కూడా ముత్తుమారి, నేనే కలుస్తున్నామని, ఈ విషయం తెలుసుకున్న వైరస్వామి అతని భార్యను చితకబాదేశాడని, అందుకే అతన్ని చంపేసి మేము కలిసి జీవించాలని అనుకున్నామని ఇసాక్ ముత్తు పోలీసులకు చెప్పాడు.

 కన్నింగ్ పెళ్లామ్ కథ క్లోజ్

కన్నింగ్ పెళ్లామ్ కథ క్లోజ్

వైరస్వామి హత్య కేసులో అతని భార్య మారిముత్తు, ఆమె ప్రియుడు ఇసాక్ ముత్తు, అతని స్నేహితులు కాళీరాజా, అన్బురాజాను అరెస్టు చేశామని తేన్ కాశీ పోలీసు అధికారులు తెలిపారు. మిస్ డ్ కాల్ తో భర్త వైరముత్తును హత్య చేయించిన ముత్తుమారి భలేనాటకాలు అడి చివరికి పోలీసులకు చిక్కిపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. భర్తను చంపించి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న భార్య ఇప్పుడు జైలుపాలైయ్యింది.

English summary
Illegal affair: Wife gave missed call to her paramour to kill her husband near Tenkasi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X