Khiladi: పక్కింటి ప్రియుడితో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, కట్ చేస్తే గుండెపోటు, క్లైమాక్స్ !

బెంగళూరు/ మైసూరు: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొంతకాలం భర్తతో చక్కగా కాపురం చేసిన భార్యకు పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడు పరిచయం అయ్యాడు. భర్త సొంత పనుల మీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఖాళీగా ఉంటున్న యువకుడు పక్కింటి లేడీకి దగ్గర అయ్యాడు. భర్తకు పంగనామాలు పెట్టిన భార్య పక్కింటి కుర్రాడితో జల్సా చేసింది. పెళ్లికాకుండానే పక్కింటి లేడీతో పడక సుఖం చిక్కడంతో ప్రియుడు ఆమె మోజులో పడిపోయాడు. పక్కింటి ప్రియుడితో భార్య రొమాన్స్ చేస్తున్న సమయంలో భర్త ఎంట్రీ ఇచ్చాడు. నేను తప్పు చేశానని, జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యనని భార్య ఆమె భర్త కాళ్లు పట్టుకుని ఆమె అక్రమ సంబందం విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసింది. ఉదయం భార్య తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లకు చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అయితే అక్కడ సీన్ రివర్స్ కావడంతో అసలు కథ మొదలైయ్యింది.

 భర్తతో సంతోషంగా కాపురం చేసింది

భర్తతో సంతోషంగా కాపురం చేసింది

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హుణసూరు తాలుకాలోని హుండిమాళ గ్రామంలో లోకమణి అలియాస్ లోకా (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 9 సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన హెచ్ డీకోటే తాలుకాలోని అగసనహుండి గ్రామంలో నివాసం ఉంటున్న శిల్పా (34) అనే మహిళను లోకమి పెళ్లి చేసుకున్నాడు. లోకమణి అతని భార్య శిల్పాతో సంతోషంగా కాపురం చేశాడు.

 పక్కింటి కుర్రాడు ఎంట్రీ

పక్కింటి కుర్రాడు ఎంట్రీ

పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలు లోకమణి, శిల్పా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొంతకాలం భర్త లోకమణితో చక్కగా కాపురం చేసిన శిల్పాకు పక్కింటిలో నివాసం ఉంటున్న రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రతిరోజు శిల్పా పక్కింటి కుర్రాడు రాకేష్ తో మాట్లాడటం మొదలుపెట్టింది.

 కిలాడీ లేడీ మోజులో పడిపోయిన ప్రియుడు

కిలాడీ లేడీ మోజులో పడిపోయిన ప్రియుడు

భర్త లోకమణి సొంత పనుల మీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఖాళీగా ఉంటున్న రాకేష్ పక్కింటి లేడీ శిల్పాకు రానురాను దగ్గర అయ్యాడు. కొంతకాలం తరువాత భర్త లోకమణికి పంగనామాలు పెట్టిన అతని భార్య శిల్పా పక్కింటి కుర్రాడు రాకేష్ అతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేసింది.

 బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య

బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య

పెళ్లికాకుండానే పక్కింటి లేడీ శిల్పాతో పడక సుఖం చిక్కడంతో ఆమె ప్రియుడు రాకేష్ శిల్పా మోజులో పడిపోయి ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. పక్కింటి ప్రియుడు రాకేష్ తో శిల్పా రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆమె భర్త లోకమణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి బెడ్ రూమ్ సీన్ చూసి షాక్ అయ్యాడు.

 గుండెపోటు నాటకాలు ఆడిన కిలాడీ పెళ్లామ్

గుండెపోటు నాటకాలు ఆడిన కిలాడీ పెళ్లామ్

నేను తప్పు చేశానని, జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యనని శిల్పా ఆమె భర్త లోకమణి కాళ్లు పట్టుకుని ఆమె అక్రమ సంబందం విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసింది. రాత్రి భోజనం చేసిన లోకమణి నిద్రపోయాడు. ఉదయం శిల్పా తన భర్త లోకమణి గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లకు చెప్పి అంత్యక్రియలు ఏర్పాట్లు చేసింది. అయితే లోకమణి గొంత మీద గాయాలు ఉండటంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

పోలీసుల విచారణలో తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న తన భర్త లోకమణి గొంతు నులిమి చంపేశానని శిల్పా అంగీకరించింది. లోకమణి హత్యకు అతని భార్య శిల్పాకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడా ? అని ఆరా తీస్తున్నామని మైసూరు జిల్లా పోలీసులు తెలిపారు. భర్త లోకమణిని చంపేసి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న శిల్పా ఇప్పుడు జైలుపాలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+