Illegal affair: కూతురి బర్త్ డే రోజు భర్తను చంపిన భార్య, ప్రియుడు, కర్పూరం స్కెచ్ రివర్స్ !
జైపూర్/రాజస్థాన్: హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు చక్కగా కాపురం చేస్తున్నారు. దంపతుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సొంతంగా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. భర్త షాపులో ఓ యువకుడు పని చేస్తున్నాడు. భర్త ఉదయం షాపుకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. ఎర్రగా, లావుగా, పొడవుగా ఉంటున్న భార్య మీద ఆమె భర్తకు రానురాను అనుమానం పెరిగిపోయింది. ఇదే సమయంలో షాపులో పని చేస్తున్న యువకుడు పదేపదే అతని యజమాని ఇంటికి వెళ్లి గంట, రెండు గంటలు అక్కడ కాలం గడిపి వస్తున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను బెడ్ రూమ్ లో దూరం పెడుతోందని ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది.
ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇటీవల కాలంలో భర్త అతని భార్యను చితకబాదుతున్నాడు. కూతురి పుట్టిన రోజు వేడుకలను అతను ఇంట్లో గ్రాండ్ గా నిర్వహించాడు. ఆ రోజు నుంచి అతను కనకపడకుండా పోయాడు. కొన్ని రోజుల తరువాత ఓ సంచిలో కనపడకుండా పోయిన వ్యక్తి శవమై కనిపించాడు. శరీరం నుంచి దుర్వాసన రాకుండా సంచిలో కర్పూరం ప్యాకెట్లు పూర్తిగా నింపేశారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఓ మహిళ, ఓ యువకుడు యాక్టీవా స్కూటర్ లో వచ్చి శవం ఉన్న సంచి అక్కడ విసిరేసి వెళ్లిపోయారని గుర్తించారు. పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

దంపతులకు ఇద్దరు కూతుర్లు
రాజస్థాన్ లోని జైపూర్ లోని నివారు ప్రాంతంలో శక్తి సింగ్ షెహకావత్ అలియాస్ శక్తి (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరా క్రితం శక్తి సింగ్ మంజు రాథోడ్ (30) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న శక్తి సింగ్, మంజు రాథోడ్ దంపతులు చక్కగా కాపురం చేస్తున్నారు. శక్తి సింగ్, మంజు రాథోడ్ దంపతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వ్యాపారం చేస్తున్న భర్త
శక్తి సింగ్ సొంతంగా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. మంజు రాథోడ్ భర్త శక్తి సింగ్ షాపులో పంకజ్ అనే యువకుడు పని చేస్తున్నాడు. శక్తి సింగ్ అతని దగ్గర పని చేస్తున్న పంకజ్ కు నెలకు 8 వేల రూపాయల డబ్బులతో పాటు ప్రతిరోజు ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నాడు. భర్త శక్తి సింగ్ ప్రతిరోజూ ఉదయం షాపుకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు.

ఎర్రగా, బుర్రగా ఉన్న భార్య మీద అనుమానం
ఎర్రగా, లావుగా, పొడవుగా ఉంటున్న భార్య మంజు రాథోడ్ మీద ఆమె భర్త శక్తి సింగ్ కు రానురాను అనుమానం పెరిగిపోయింది. ఇదే సమయంలో షాపులో పని చేస్తున్న పంకజ్ పదేపదే అతని యజమాని శక్తి సింగ్ ఇంటికి వెళ్లి గంట, రెండు గంటలు అక్కడ కాలం గడిపి వస్తున్నాడు. తన దగ్గర పని చేస్తున్న పంకజ్ తన భార్య మంజు రాథోడ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటాడని శక్తి సింగ్ కు డౌట్ వచ్చింది.

బెడ్ రూమ్ లో అందుకే దూరం పెడుతోందా ?
తన భార్య మంజు రాథోడ్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను బెడ్ రూమ్ లో దూరం పెడుతోందని ఆమె భర్త శక్తి సింగ్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో శక్తి సింగ్, మంజు రాథోడ్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత షాపులో పని చేస్తున్న పంకజ్ ను శక్తి సింగ్ పనిలో నుంచి తీసేశాడు. తన షాపు దగ్గరకు కాని, ఇంటి దగ్గరకు కాని నువ్వు రాకూడదని పంకజ్ కు శక్తి సింగ్ చెప్పాడు.

కూతురు పుట్టిన రోజు ?
కొంత కాలంగా శక్తి సింగ్ అతని భార్య మంజు సింగ్ ను చితకబాదుతున్నాడు. ఈనెల 2వ తేదీన శక్తి సింగ్ అతని కూతురి పుట్టిన రోజు వేడుకలను ఇంట్లో గ్రాండ్ గా నిర్వహించాడు. రాత్రి ఇంట్లో శక్తి సింగ్ పీకలదాక మద్యం సేవించి బెడ్ రూమ్ లో పడుకున్నాడు. ఆ సమయంలో మంజు సింగ్ షాపులో పని చేసి ఉద్యోగం మానేసిన పంకజ్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.

పక్కాప్లాన్ తో హత్య.... రెండు రోజులు ఇంట్లో శవం
ఇంట్లో బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భర్త శక్తి సింగ్ కాళ్లు కట్టేసిన అతని భార్య మంజు రాథోడ్ తరువాత తలుపులు తీసి పంకజ్ ను ఇంట్లోకి రప్పించింది. తరువాత పంకజ్ తాడు తీసుకుని శక్తి సింగ్ గొంతు బిగించి చంపేశాడు. రెండు రోజుల పాటు ఇంట్లో ఇద్దరు కూతుర్ల కంట్లో శక్తి సింగ్ శవం కనపడకుండా మంజు రాథోడ్ జాగ్రత్తలు తీసుకుంది.

గోనె సంచిలో శవం కట్టేసి దుర్వాసన రాకుండా కర్పూరం నింపేశారు
తరువాత మంజు రాథోడ్, పంకజ్ కలిసి గోనెసంచిలో శక్తి సింగ్ వేసి శరీరం నుంచి దుర్వాసన రాకుండా సంచిలో కర్పూరం ప్యాకెట్లు పూర్తిగా నింపేశారు. తరువాత శవాన్ని యాక్టివా స్కూటర్ లో తీసుకెళ్లి రోడ్డు పక్కన నిర్జనప్రదేశంలో విసిరేశారు. మరుసటి రోజు సంచి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని డీసీపీ రామ్ సింగ్ అన్నారు.

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన భార్య
హత్యకు గురైయ్యింది శక్తి సింగ్ అని పోలీసులు నిర్దారించుకున్నారు. పోలీసులు శక్తి సింగ్ శవం చిక్కిన రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఆ సమయంలో ఓ మహిళ, ఓ యువకుడు యాక్టీవా స్కూటర్ లో వచ్చి శక్తి సింగ్ శవం ఉన్న సంచి అక్కడ విసిరేసి వెళ్లిపోయారని గుర్తించారు.

నా భర్తను అందుకే చంపేశాను
పోలీసులు శక్తి సింగ్ భార్య మంజు రాథోడ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు విషయం బయటకు వచ్చిందని డీసీపీ రామ్ సింగ్ మీడియాకు చెప్పారు. తన అక్రమ సంబంధం విషయంలో తన భర్త శక్తి సింగ్ నిత్యం గొడవ చేసేవాడని, తనను ప్రతిరోజు పట్టుకుని చితకబాదుతున్నాడని, అందుకే అతన్ని చంపేశామని మంజు రాథోడ్ అంగీకరించిందని, ఆమెతో పాటు పంకజ్ ను అరెస్టు చేశామని డీసీపీ రామ్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications