Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: బావ బాధ చూడలేక అక్క ప్రియుడిని అడ్డంగా లేపేశాడు, రౌడీషీటర్ అని ధీమాతో !

న్యూఢిల్లీ: ఓ మహిళ వివాహం చేసుకుని ఆమె భర్తతో కలిసి జీవిస్తోంది. వివాహిత మహిళ ఆమె భర్త కళ్లు కప్పి ఓ యువడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు నేరస్తుడు. అతని మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. వివాహిత మహిళతో ఎంజాయ్ చేస్తున్న యువకుడు ఎప్పటిలాగే రెచ్చిపోతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త అతని భార్య అక్రమ సంబంధానికి చెక్ పెట్టలేకపోయాడు. అయితే వివాహిత మహిళ తమ్ముడికి విషయం తెలిసి రగిలిపోయాడు. ఎలాగైనా తన సోదరి ప్రియుడిని చంపేయాలని ఆ యువకుడు స్కెచ్ వేశాడు. సాటి స్నేహితులకు విషయం చెప్పిన యువకుడు అతని అక్క ప్రియుడిని దారుణంగా హత్య చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

 క్రిమినల్ కేసులు

క్రిమినల్ కేసులు

దేశరాజధాని ఢిల్లీలో షారుక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 24 ఏళ్లకే షారుక్ అనేక నేరాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అనేక నేరాలు చేసిన షారుక్ మీద ఇప్పటికే చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. నేరాలు చెయ్యడం, జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు రావడం షారుక్ కు అలవాటు అయిపోయింది.

 వివాహిత మహిళతో అక్రమ సంబంధం

వివాహిత మహిళతో అక్రమ సంబంధం

ఢిల్లీలోనే నివాసం ఉంటున్న ఓ మహిళ వివాహం చేసుకుని ఆమె భర్తతో కలిసి జీవిస్తోంది. వివాహిత మహిళకు షారుక్ కు ఇంతకు ముందే పరిచయం ఉంది. భర్త కళ్లు కప్పిన కిలాడీ లేడీ రౌడీషీటర్ షారుక్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న షారుక్ ఇప్పటికే నేరస్తుడు కావడంతో అతని ఆగడాలకు అడ్డులదుపులేకుండా పోయింది.

 భర్తకు తెలిసినా సైలెంట్ గా ఉండిపోయాడు

భర్తకు తెలిసినా సైలెంట్ గా ఉండిపోయాడు

షారుక్ మీద అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అతను అనుకున్నాడు. వివాహిత మహిళతో ఎంజాయ్ చేస్తున్న షారుక్ ఇంకా రెచ్చిపోతున్నాడు. విషయం తెలుసుకున్న షారుక్ ప్రియురాలి భర్త అతని భార్య అక్రమ సంబంధానికి చెక్ పెట్టలేక, అతన్ని ఏమీ చెయ్యలేక సైలెంట్ గా ఉండిపోయాడు.

 ప్రియురాలి తమ్ముడి స్కెచ్

ప్రియురాలి తమ్ముడి స్కెచ్

షారుక్ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు జుబేర్ అనే తమ్ముడు ఉన్నాడు. వివాహిత మహిళ తమ్ముడు జుబేద్ కు విషయం తెలిసి షారుక్ మీద రగిలిపోయాడు. ఎలాగైనా తన సోదరి ప్రియుడు షారుక్ ను చంపేయాలని జుబేర్ స్కెచ్ వేశాడు. కొంతకాలం నుంచి షారుక్ హత్య చెయ్యాలని జుబేర్ వేచి చూస్తున్నాడు.

 దారుణంగా కొట్టి చంపేసిన ఫ్రెండ్స్

దారుణంగా కొట్టి చంపేసిన ఫ్రెండ్స్

రాత్రి 11.30 గంటల సమయంలో పీకలదాక మద్యం సేవించిన షారుక్ బైక్ లో ఇంటికి బయలుదేరాడు. సాటి స్నేహితులకు విషయం చెప్పిన జుబేర్ అతని అక్క ప్రియుడు షారుక్ ను అడ్డగించి మెటల్ కుర్చీతో తల మీద దాడి చేసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో వీడియోలు తీశారని వెలుగు చూసింది. షారుక్ ను హత్య చేసే సమయంలో ఓ మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, నిందితుల్లో ఒక్కరు ఆమెను పక్కకు తోసేశారని పోలీసు అధికారులు అంటున్నారు. షారుక్ హత్య కేసులో జుబేర్, ఆదిత్య అనే ఇద్దరిని అరెస్టు చేశామని, జాఫర్ అనే నిందితుడు తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+