బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal: బెంజ్ కారులో రూ. 75 లక్షలు సీజ్, రంజాన్ రోజు ఇమ్రాన్ కు షాక్, అసలు వ్యాపారం ఏమిటంటే ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు/దావణగెరె: అతను ఖరీదైన దస్తులు వేసుకుంటున్నాడు. ఖరీదైన దుస్తులు వేసుకోవడమే కాకుండా బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు. చిన్నచిన్న కార్లలో కాకుండా బెంజ్ కారు దిగకుండా తిరుగుతున్న అతను జోరుగా వ్యాపారం చేస్తూ ప్రతినెల రూ. లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నాడు. కోట్ల రూపాయలు అంటే లెక్కలేకుండా డబ్బు సంపాధిస్తున్న ఆ వైట్ కాలర్ వ్యక్తి మీద పోలీసులు కొంతకాలంగా నిఘా వేశారు.

 ఐజీపీ, 10 మంది ఐపీఎస్ అధికారులతో లింక్ ?

ఐజీపీ, 10 మంది ఐపీఎస్ అధికారులతో లింక్ ?

అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న అతను ఓ ఐజీపీ స్థాయి అధికారితో సహ 10 మందికి పైగా ఐపీఎస్ అధికారులతో టచ్ ఉన్నాడు. ఇతని ఆగడాలను ఇంతకాలం చూస్తున్న డీసీఆర్ బీ పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఇమ్రాన్ సిద్దిఖి అలియాస్ ఇమ్రాన్ అలియాస్ సిద్దిఖి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

 బెంజ్ కారులో రూ. 75 లక్ష్లలు సీజ్

బెంజ్ కారులో రూ. 75 లక్ష్లలు సీజ్

ఇమ్రాన్ ను అరెస్టు చేసే సమయంలో అతని బెంజ్ కారులో రూ. 75 లక్షల నగదు సీజ్ చేశారంటే మనోడు ఏ రేంజ్ లో వ్యాపారం, దందాలు చేస్తున్నాడో అర్థం అవుతోందని పోలీసులు అంటున్నారు. ఇమ్రాన్ మీద కర్ణాటకలోని దావణగెరె గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు

 ఐదు జిల్లాల్లో అక్రమంగా ఇసుక వ్యాపారం

ఐదు జిల్లాల్లో అక్రమంగా ఇసుక వ్యాపారం

తుంగభద్రా నదీ తీరంలో ఇమ్రాన్ ఇసుక దందా చేస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఇమ్రాన్ ఎలాంటి ఇసుక వ్యాపారం లైసెన్స్ తీసుకోకుండా తుంగభద్రా నదీ తీరంలో అతను అక్రమంగా ఇసుక ఎత్తుకుని వ్యాపారం చేస్తున్నాడని డీసీఆర్ బి పోలీసులు అంటున్నారు, దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, హావేరి తదితర జిల్లాలో ఇమ్రాన్ అక్రమంగా ఇసుక దందా చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

 వైట్ కాలర్ నిందితుడు

వైట్ కాలర్ నిందితుడు

కొందరు పోలీసు అధికారులతో నేరుగా టచ్ లో ఉన్న వైట్ కాలర్ నిందితుడు ఇమ్రాన్ ఇంతకాలం అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. రంజాన్ పండుగ సందర్బంగా టిప్పుటాపుగా వెలుతున్న ఇమ్రాన్ ను అరెస్టు చెయ్యడంతో అతనితో ఇంతకాలం టచ్ లో ఉన్న పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారని తెలిసింది.

English summary
Illegal: Karnataka police arrests illegal sand mining kingpin in Davanagere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X