మహిళా ఎస్ఐని ఢీకొన్న వాహనం: దుర్మరణం, కావాలనే చంపేశారా ? ప్రమాదమా ?
చెన్నై: విధినిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐని వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఆమె సంఘటనా స్థలంలో దుర్మరణం చెందిన ఘటన తమిళనాడులోని తిరునల్వేలి తాలైయతు ప్రాంతంలో జరిగింది. అఖిల (30) అనే మహిళా ఎస్ఐ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
తిరునల్వేలిలో అఖిల సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం మద్యాహ్నం తాలైయతు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సబ్ ఇన్స్ పెక్టర్ అఖిల తన సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు.

రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని సంఘటనా స్థలంలో పరిశీలించి ప్రత్యక్షసాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆ సందర్బంలో వేగంగా వెళ్లిన వ్యాన్ రోడ్డు పక్కన విచారణ చేస్తున్న మహిళా ఎస్ఐ అఖిల ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐ అఖిల సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనాడు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఎస్ఐ అఖిల మరణించారా ? లేదంటే కావాలనే వ్యాన్ తో ఢీకొని ఆమెను హత్య చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తిరునల్వేలి పోలీసు అధికారులు తెలిపారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications