ట్రంప్ కు అదిరిపోయే కౌంటర్ రెడీ చేసిన భారత్.. తగ్గేదేలే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 50% సుంకాలు నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో భారత్ ట్రంప్ విధించిన సుంకాల బారి నుండి మన వాణిజ్య రంగాన్ని రక్షించుకోవడానికి కౌంటర్ ప్రణాళికలను రూపొందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ లు, జరిమానాలతో ప్రభావితమయ్యే రంగాలను రక్షించాలని నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ అందుకు ప్లాన్ చేసింది.

భారత్ ఎగుమతులపై వివిధ దేశాల్లో ప్రమోషన్స్
ఈ క్రమంలో భారత ఎగుమతులపైన వివిధ దేశాలలో ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని, తద్వారా మన ఉత్పత్తుల మార్కెట్ ను ఇతర దేశాలలో విస్తరించాలని నిర్ణయించింది.భారతదేశంలో తయారయ్యే జౌళి వస్తువులు, జెమ్స్, ఆభరణాలు, దుస్తులు వంటి ఎగుమతుల పైన 40 దేశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

India has planned a stunning counter to Trump indian products publicity program in 40 countries

Take a Poll

ఈ దేశాల్లో భారత్ ఎగుమతుల ప్రమోషన్స్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా, బెల్జియం, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ , ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, మెక్సికో, కెనడా, పోలాండ్ తదితర దేశాలలో భారత్ ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం భారతదేశం 220 దేశాలకు తమ ఎగుమతులను చేస్తోంది. ఇందులో ప్రతిపాదిత 40 దేశాలు చాలా కీలకమైనవి.

ఈ దేశాలపై ఫోకస్ అందుకే
ఈ దేశాలన్నీ కలిపి ప్రతి సంవత్సరం 590బిలియన్ డాలర్లకు పైగా విలువైన టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దేశాలలో మన స్వదేశీ ఉత్పత్తుల మార్కెట్ పెంచుకుంటే అది మన పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కల్పిస్తుందని మోడీ సర్కార్ భావిస్తోంది. మనదేశంలో సూరత్, పానిపట్, తిరుపూర్, బదోహి వంటి ప్రాంతాలలో పేరుపొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ నలభై దేశాలలో ప్రచారం కల్పించడం చేస్తుంది.

యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
మనదేశంలోని వస్తువుల నాణ్యతను,సుస్థిరతను ఆయా దేశాలకు చాటిచెప్పేలా ఈ ప్రోగ్రామ్ లను డిజైన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే భారత్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లను, వాణిజ్య మేళా లను, అమ్మకందారులు మరియు కొనుగోలుదారులతో సమావేశాలను యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా నిర్వహించబోతోంది. ఈ చర్యల ద్వారా భారత వాణిజ్య రంగాన్ని రక్షించాలని భారత్ చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+