India-Canada Row: కెనడాకు భారత్ ఘాటు కౌంటర్-రాయబారికి సమన్లు..!
భారత్-కెనడా మధ్య దౌత్య పోరు ముదురుతోంది. ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ కు సహకరించారనే ఆరోపణలతో మన రాయబారిపై కెనడా తాజాగా చర్యలు తీసుకుంది. దీంతో భారత్ కూడా ఘాటుగా స్పందించింది. భారత్ లో కెనడా రాయబారి స్టీవార్ట్ వీలర్ కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. దీంతో కెనడా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఇరుదేశాల మధ్య ఇదే అంశంపై పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి.
తాజాగా కెనడాలో భారత హైకమిషనర్ గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ వర్మను హర్దీప్ సింగ్ నిజ్జార్ కేసులో ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఆ దేశం అభియోగాలు మోపింది. అంతకు ముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ఉద్దేశించి భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తుల్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది. దీంతో కెనడా ప్రభుత్వం భారత హైకమిషనర్ ను టార్గెట్ చేసింది.

దీనికి స్పందనగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్త స్టీవార్ట్ వీలర్ కు సమన్లు జారీ చేసింది. కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. దీంతో వీలర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వీలర్ స్పందన ఆధారంగా మన విదేశాంగశాఖ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయుల పాత్రపై కెనడా పదే పదే చేస్తున్న ఆరోపణలు కేంద్రాన్ని చికాకుపెడుతున్నాయి.












Click it and Unblock the Notifications