ఇండియా పేరు భారత్ గా మారితే ఆ వెబ్ సైట్లకు తిప్పలు తప్పవు!!
ఇండియా పేరును భారత్ గా మార్చడం కోసం కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ మేరకు అడుగులు వేసిన కేంద్ర ప్రభుత్వం బ్రిక్స్ సదస్సు, జీ 20 సదస్సు అతిథులకు పంపిన ఆహ్వానాలలో "ప్రెసిడెంట్ ఆఫ్ భారత్", "ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్" అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇండియా పేరును భారత్ గా మారిస్తే భారత రాజ్యాంగంలోని పలుచోట్ల సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాదు ఇండియా పేరు భారత్ గా మారితే దేశంలోని వేలాది వెబ్సైట్లకు పెద్ద కష్టమే వచ్చి పడుతుంది. ఎందుకంటే చాలా వెబ్ సైట్లు తమ వెబ్సైట్ డొమైన్ నేమ్ లో ఇండియాలోని తొలి రెండు అక్షరాలతో డాట్ ఇన్ అనే డొమైన్ ను వాడుతున్నాయి.

అయితే ఇండియా పేరు భారత్ గా మార్చితే ఈ డాట్ ఇన్ డొమైన్ భారత్ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. కాబట్టి వెబ్సైట్ల వాళ్ళు కూడా ఇండియా పేరు మారితే వారి డొమైన్ నేమ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చకపోతే వారి డొమైన్ భారతదేశాన్ని ప్రతిబింబించదు. కాబట్టి భారత్ పేరును ప్రతిబింబించేలా వారు కూడా వెబ్సైట్ డొమైన్ మార్చుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇండియా పేరును భారత్ అని మార్చాలనే ఆలోచన పట్ల ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశానికి భారత్ అని, ఇండియా అని రెండు పేర్లు ఉన్నాయని, రాజ్యాంగం ప్రకారం ఇండియాను, భారత్ అని పిలవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, రెండు పేర్లు పిలవడానికి ఉపయోగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా పేరుని ''భారత్'' గా మార్చడాన్ని మీరు సమర్థిస్తారా..?#INDIA #BHARAT #ModiGovt #PMModi #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) September 6, 2023
అయితే వందల ఏళ్లుగా ఇండియా పేరుతో బ్రాండ్ వాల్యూ నిర్మించుకున్నాం అని దీనిని దెబ్బ తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించకూడదని కూడా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications