దేశం పరుపుపోతోంది..! వీధి కుక్కల విషయంలో రాష్ట్రాలపై సుప్రీం ఫైర్..!
దేశవ్యాప్తంగా చిన్నారుల్ని వీధి కుక్కలు కరుస్తున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉండటం, తాము ఆదేశాలు ఇచ్చినా రాష్ట్రాలు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా మండిపడింది. వీధి కుక్కల్ని పట్టుకుని, వాటికి వ్యాక్సిన్ వేసి, తిరిగి వదిలిపెట్టాలన్న తమ ఆదేశాలపై తమ అభిప్రాయాలు చెప్పాలని ఆగస్టు 22న తాము ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికీ మెజార్టీ రాష్ట్రాలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది.
దేశంలో చిన్నారులకు కుక్కకాటు ఘటనలతో విదేశాల ముందు పరువు పోతోందని, ఆయా దేశాలు మన దేశాన్ని చులకనగా చూస్తున్నాయని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము ఆగస్టు 22న ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ వాటికి స్పందించని రాష్ట్రాల సీఎస్ లను వ్యక్తిగతంగా వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటివరకూ కేవలం తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కార్పోరేషన్ మాత్రమే సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా జాతీయ రాజధాని ఢిల్లీ ఎందుకు తమ అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం..
ప్రధాన కార్యదర్శి వివరణ ఇవ్వాలని, లేకుంటే జరిమానా విధిస్తామని, తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవాళ నోటీసులు పంపుతున్నట్లు తెలిపింది.నవంబర్ 3న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని, లేకుంటే తాము ఆడిటోరియంలో కోర్టును నిర్వహిస్తామని హెచ్చరించింది.

ఆగస్టు 22న జస్టిస్ విక్రమ్ నాథ్ బెంచ్ ఆగస్టు 11న వీధి కుక్కల్ని పట్టుకుని ఊరి చివర వదిలేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. చికిత్స పొందిన, టీకాలు వేసిన కుక్కల విడుదలపై నిషేధాన్ని చాలా కఠినమైనదిగా పేర్కొంటూ జంతువుల జనన నియంత్రణ సంస్థ నిబంధనలలోని 11(9) ప్రకారం రేబిస్ సోకినవి, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానించబడినవి, దూకుడు ప్రవర్తనను ప్రదర్శించేవి తప్ప, స్టెరిలైజేషన్, నులిపురుగుల నిర్మూలన, టీకాలు వేసిన తర్వాత కుక్కలను తిరిగి అదే ప్రాంతంలోకి వదలాలని స్పష్టం చేసింది. అలాగే వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం ఇవ్వడాన్ని కూడా నిషేధించింది. వాటికి ప్రత్యేక ప్రాంతాలు ఉండాలని ఆదేశించింది. కేసు పరిధిని పాన్-ఇండియా స్థాయికి విస్తరించింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications