బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత సైన్యం మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. వరుస ప్రయోగాల్లో భాగంగా మంగళవారం భూ ఉపరితలం నుంచి మరో చోటుకు పరీక్షించింది. బ్రహ్మోస్ వాస్తవ దాడి పరిధి 290 కి.మీ ఉండగా, దాన్ని ఇప్పుడు 400 కిలోమీటర్లు పెంచారు.
అంతేగాక, శబ్ద వేగానికి మూడు రెట్లు లేదా 2.9 మాక్‌ల వేగాన్ని మెయింటెన్ చేశారు. భూమిపై దాడులకు సంబంధించిన బ్రహ్మోస్ వెర్షన్‌ను అండమాన్, నికోబార్‌లో ఉదయం 10 గంటలకు విజయవంతంగా ప్రయోగించామని సంబంధిత అధికారి మీడియాకు తెలిపారు.

మరికొద్ది రోజుల్లో గగన తలం, నీటి ఉపరితల వెర్షన్లను భారత వాయుసేన, భారత నౌకాదళం పరీక్షిస్తాయన్నారు. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత సమర్థంగా లక్ష్యాన్ని ఛేదిస్తాయన్న విషయం తెలిసిందే.
Indian Army successfully launched its BrahMos supersonic cruise missile on 24 Nov 2020 in a top-attack configuration, hitting a target in the Bay of Bengal with pin point accuracy.#IndianArmy#SouthernCommand @DRDO_India#WarriorsoftheSouth#BrahMosMissile@adgpi pic.twitter.com/vec6Txdqgo
— Southern Command INDIAN ARMY (@IaSouthern) November 24, 2020
జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, నేలమీద నుంచి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఉద్రిక్తల నేపథ్యంలో చైనా సరిహద్దులోని లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే భారత్ వీటిని భారీ సంఖ్యలో మోహరించింది.
గత రెండు నెలల్లో భారత్ చాలా క్షిపణులను పరీక్షించింది. యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం-1' కూడా ఇందులోనే ఉంది. ఇటు పాకిస్థాన్, అటు పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతున్న నేపథ్యంలో భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఆధునాతన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. శత్రుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంటోంది.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications