వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం: అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ప్రయోగం సక్సెస్

|
Google Oneindia TeluguNews

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే వీలు గల ఈ క్షిపణి రేంజి 5,000 కిలోమీటర్లు. చైనాలోని కీలక ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఖండాంతర క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ప్రయోగించారు. ఈ మిస్సైల్‌లో మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను అమర్చారు. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు.

 India successfully tests nuclear-capable Agni-5 ballistic missile

దీంతో రక్షణ రంగంలో భారతదేశం మరో పెద్ద విజయం సాధించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలిగే సామర్థ్యం దీని సొంతం. అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ని బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ బుధవారం విజయవంతంగా పరీక్షించారు.

అగ్ని-5 సిరీస్‌ ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీనికి సంబంధించి సంబంధిత వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏడాది తర్వాత ప్రయోగించగా.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

Recommended Video

T20 World Cup 2021: Namibia Beat Scotland By 4 Wickets | Oneindia Telugu

భారత్ తన ఆయుధాలను మొదటగా ఉపయోగించదు అనే విధానానికి అనుగుణంగానే అగ్ని-5 ప్రయోగం జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు లడాఖ్​లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. విజయవంతంగా భారత్ క్షిపణి ప్రయోగం జరిపింది.

English summary
India successfully test-fired a surface-to-surface ballistic missile, Agni-5, from APJ Abdul Kalam Island off Odisha coast on Wednesday. It was test-fired at 7.50 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X