వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఉగ్ర సూత్రధారి లఖ్వీ విడుదల: ఐరాస హామీని స్వాగతించిన భారత్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి జకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ విడుదల అంశంపై జోక్యం చేసుకుంటామన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ హామీ ఇవ్వడాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్వాగతించారు.

ముంబై 26/11 ఉగ్ర దాడుల కుట్రపన్నిన లఖ్వీని 2008 డిసెంబర్‌లో, 2009 నవంబర్ 25న మరో ఆరుగురిని పాకిస్ధాన్ అరెస్ట్‌చేసింది. ఆరోజు నుంచి జైలులో ఉన్న లఖ్వీ తదితరులను విడుదల చేయాలని ఏప్రిల్ తొమ్మిదో తేదీన పాకిస్థాన్‌లోని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.

India welcomes UN security council stand on Lakhvi

దీంతో ఏప్రిల్ 11న రావల్పిండిలోని అడియాల జైలు నుంచి విడుదలయ్యారు. లఖ్వీని విడుదల చేయడంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాకి‌స్ధాన్ ఇచ్చిన హామీ గాల్లో మాటలాగే ఉందని భారత్ ఆరోపించింది. జైలుల్లో ఉన్న లఖ్వీని విడుదల చేయడం అంతర్జాతీయ నిబంధనను ఉల్లంఘించడమేనని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ యూఎన్‌ఎస్సీ ఆంక్షల కమిటీ చైర్మన్ జిమ్ మిక్‌లేకు ఐరాసలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ లేఖరాశారు.

భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి జకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ విడుదల అంశంపై జోక్యం చేసుకుంటామని భారత్‌కు ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి కమిటీ హామీ ఇచ్చింది. త్వరలో యూఎన్‌ఎస్సీ కమిటీ నిర్వహించనున్న సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ఉగ్రవాద దాడులకు కుట్రలు, వ్యూహాలు రచించి, ఆర్థిక వనరులు సమకూర్చినందుకు లఖ్వీని 2008 డిసెంబర్‌లో యూఎన్‌ఎస్సీ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
India on Sunday welcomed UN security council's assurance that it would take up the issue of Pakistan-based 26/11 mastermind Zaki-ur-Rehman Lakhvi's release from prison at its next meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X