షాక్: ఆర్మీ హెలికాప్టర్ కూప్పకూలి అధికారుల మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కోలకత్తా: భారత ఆర్మీ అధికారులు వెలుతున్న హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెంది ఒకరికి తీవ్రగాయాలైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. భారత ఆర్మీ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Indian Army Cheetha helicopter crashes in Sukna in West Bengal

బుధవారం ఉదయం 11.45 గంటల సమయంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్ లోని సుక్నా ప్రాంతంలో వెలుతున్నది. ఆ సమయంలో హెలికాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.

అందులో ప్రయాణిస్తున్న ముగ్గరు ఆర్మీ అధికారులతో సహ పైలట్ దుర్మరణం చెందారు. మరో జూనియర్ కమిషన్డ్ అధికారికి తీవ్రగాయాలైనాయని అధికారులు చెప్పారు. హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయిందని, ప్రమాదానికి కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An army helicopter has reportedly crashed at Sukna Military Camp in West Bengal around 11.45 am Wednesday morning, killing three officers and leaving one junior commissioned officer critically injured.
Please Wait while comments are loading...