Asian Games 2023: చైనాకు బయల్దేరిన టీమిండియా..

టీమిండియా చైనాకు బయల్దేరింది. అదేంటి.. మన దగ్గర వరల్డ్ కప్ పెట్టుకుని చైనాకు వెళ్లడం ఏంటని అనుకుంటున్నారు. ఆసియా గేమ్స్ 2023లో పాల్గొనేందుకు కుర్రాళ్ల కూడిన టీమిండియా చైనాకు వెళ్లింది. ఈ జట్టులో అందురు కుర్రాళ్లే ఉన్నారు. ఇందులో ఉన్న ఎవరూ కూడా వరల్డ్ కప్ జట్టులో లేరు. ఆసియా గేమ్స్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు గురువారం భారత్ నుంచి బయలుదేరి వెళ్లింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి జట్టు సభ్యులు చైనాకు వెళ్తోన్న ఫొటోలని పోస్ట్ చేసింది.

టీమిండియా అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6 న రెండో మ్యాచ్ , 7న మరో మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా ప్రత్యర్ధులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. తొలి రెండు మ్యాచులు ఉదయం 6:30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి. మూడో మ్యాచ్ మాత్రం ఉదయం 11:30నిమిషాలకు ప్రారంభం అవుతోంది. ఈ మ్యాచలన్నీ టీ20 ఫార్మట్ లో జరగనున్నాయి.ఈ మ్యాచ్ లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. మొబైల్ ఫోన్ లో SonyLIV యాప్ లో ఈ మ్యాచులను చూడవచ్చు.

Indian cricket team left for China to participate in Asian Games 2023

టీమిండియా జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.


ఆసియా గేమ్స్ లో ప్రస్తుతం క్వాలిపైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లో నేపాల్ మంగోలియాపై 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 314 పరుగులు చేసింది. నేపాల్ దీపెంద్ర సింగ్ 10 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన మంగోలియా 13.1 ఓవర్ లో 41 పరుగులకే అలౌట్ అయింది. ఆసియా గేమ్స్ లో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 7న జరగనుంది. టీమిండియా ఫైనల్ కు వెళ్తుందని అందరు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+