Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యా చమురు దిగుమతికి ఇండియన్ ఆయిల్ భారీ డీల్- 3 మిలియన్ బ్యారెళ్ల సరఫరాపై

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం భారత్ కు భారీగానే కలిసొస్తోంది. అసలే అంతర్జాతీయంగా చమురు ధరలు మండుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తో యుద్ధం చేసి కుదేలవుతున్న రష్యా ప్రకటిస్తున్న బంపర్ ఆఫర్లను క్యాష్ చేసుకునేందుకు భారతీయ చమురు సంస్ధలు రంగంలోకి దిగుతున్నాయి.ఇప్పటికే భారతీయ చమురు సంస్ధలు ఈ మేరకు రష్యన్ సంస్ధలతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

రష్యాకు చెందిన చమురు సంస్ధ నుంచి భారత్ కు చెందిన అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ భారీ డీల్ కుదుర్చుకుంది. మూడు మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ టూ కంపెనీ టూ డీల్ గా రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించినా.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో భారతీయ కంపెనీలు భారీ డీల్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి.

Indian Oil corporation finalise big deal for import of Russian crude oil

భారతదేశం యొక్క చట్టబద్ధమైన ఇంధన లావాదేవీలను రాజకీయం చేయరాదని ఇప్పటికే భారత్ కోరుతోంది. చమురులో స్వయం సమృద్ధిగా ఉన్న దేశాలు లేదా రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న దేశాలు నిర్బంధ వాణిజ్యాన్ని విశ్వసనీయంగా సమర్థించలేవని ప్రభుత్వ వర్గాలు నిన్న తెలిపాయి. రష్యా నుండి డిస్కౌంట్ తో కూడిన ముడి చమురును దిగుమతి చేసుకోవడం ఆంక్షలను ఉల్లంఘించినట్లు కాదని యూఎస్ కూడా చెబుతోంది.

రష్యా చమురు కంపెనీతో ముడి చమురు దిగుమతి ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం భారతదేశానికి అందుబాటులో ఉన్న నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా కంపెనీల నుంచి ముడిచమురు కొనుగోలు చేయడంపై భారతీయ చమురు సంస్థలకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆ వర్గాలు తెలిపాయి.
యూఎస్, ఇతర పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో, రష్యా చమురు ఇతర వస్తువులను భారతదేశతో పాటు ఇతర పెద్ద దిగుమతిదారులకు తగ్గింపు ధరలకు ఇవ్వడం మొదలుపెట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+