వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఫ్యాషన్ ఐకాన్’: మోడీపై అమెరికన్ మీడియా ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ అంటేనే ముఖం చాటేసిన అమెరికా, అమెరికన్ మీడియా.. ఇప్పుడు ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ఇంతకాలం నరేంద్ర మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరంచిన అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తోంది. అమెరికా మీడియా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తోంది.

లోకసభ ఎన్నికల్లో తన సారథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఘనవిజయం అందించి.. ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి అమెరికా వైఖరి స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. అమెరికాలో అత్యధిక సర్క్యులేషన్ గల టైమ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు మోడీ వేషదారణను ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.

Indian PM Modi hailed as new 'fashion icon' by American media

నరేంద్ర మోడీని ఫ్యాషన్ ఐకాన్‌గా అభివర్ణించాయి. న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో..‘నాయకుడంటే ఇలాంటి దుస్తులే ధరించాలి' అని పేర్కొంది. ఇందులో మోడీ ధరించే కుర్తా గురించి రాశారు. ఇండియన్ ఫ్యాషన్‌ను ప్రతిబింబించే విధంగా ఆయన వస్త్రధారణ ఉందంటూ టైమ్స్ మెగజైన్ పేర్కొంది.

ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ఐకాన్ వచ్చారంటూ నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించింది. వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ చూపే అమెరికా ప్రథమ మహిళ మిచెల్లి ఒబామా, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌లతో పోలుస్తూ మోడీని ఆకాశానికెత్తేసింది.

English summary
Narendra Modi, who was unwelcome here only a few years ago, is now a "fashion icon" to the American media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X