RAC: ఫుల్ టికెట్ తో హాఫ్ సీటా? 50శాతం రిఫండ్ ఎప్పుడో ?
భారతీయ రైల్వేలు అమలు చేస్తున్న ఆర్ఏసీ(RAC) విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ గా పేర్కొనే ఈ ఆర్ఏసీ విధానంలో భాగంగా ఓ రైల్లో టికెట్ బుక్ చేసుకున్న ఇద్దరు ప్రయాణికులకు కన్ఫమ్ టికెట్ ఇవ్వలేని పరిస్ధితుల్లో రైల్వే ఇద్దరికీ కలిపి ఒకే బెర్త్ కేటాయిస్తోంది. దీని వల్ల రైల్వేకు లాభాల పంట పండుతుండగా ప్రయాణికులకు నిలుపుదోపిడీ అవుతోంది.
తాజాకే రైల్వే అందుబాటులోకి తెచ్చిన కొత్త రైళ్లు అమృత్ భారత్, వందే భారత్ స్లీపర్ లలో ఈ ఆర్ఏసీ విధానాన్ని ఎత్తేశారు. భారీ చార్జీలు వసూలు చేస్తున్న ఈ ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు దానికి తగ్గట్టుగా సౌకర్యాలు అందించాల్సిన పరిస్ధితుల్లో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిరిగి ఏమైందో కానీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఈ రైళ్లలోనూ ఆర్ఏసీ విధానం కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ప్రీమియం రైళ్లలో భారీ ఛార్జీలు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నా ప్రయాణికులకు ఆర్ఏసీ బాధలు మాత్రం తప్పడం లేదు.

అమృత్ భారత్, వందే భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రైల్వే శాఖ.. దాని స్ధానంలో ఎమర్జెన్సీ టికెట్ల పేరుతో మరో కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రైళ్ల రద్దీ ఆధారంగా ఎమర్జెన్సీ కోటా ప్రకారం అదనపు సీట్లు కేటాయిస్తామని రైల్వే చెబుతోంది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో ఈ ప్రీమియం రైళ్లతో పాటు మిగతా రైళ్లలోనూ ఆర్ఏసీ విధానం కొనసాగుతోంది. దీనిపై తాజాగా పార్లమెంటరీ కమిటీ ఇలా ఆర్ఏసీ కింద టికెట్లు పొందిన ప్రయాణికులకు ఛార్జీల్లో 50 శాతం వెనక్కి ఇవ్వాలని సూచించింది. అయితే దీన్ని అమలు చేసే విషయంలో రైల్వే సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సగం ఛార్జీ వెనక్కి ఇస్తే రైల్వే దోపిడీకి చెక్ పడినట్లే.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications