వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: అమెరికాలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు కల్పించనున్న ఇన్పోసిస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికాలోనే నివాసం ఉంటున్నవారిని ఉద్యోగులుగా నియమించుకోవాలని ఇన్పోసిస్ నిర్ణయం తీసుకొంది.రానున్న రెండేళ్ళలో సుమారు 10 వేల మంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమించుకొనే అవకాశం ఉంది.దీంతో ఇండియాకు చెందిన టెక్కీలకు షాక్ కలగనుంది.
హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలను కఠినతరం చేయడంతో ఈ మేరకు గత్యంతరం లేకపోవడంతో ఇన్పోసిస్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది.

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాఫ్ట్ వేర్ రంగంపై ఆయన తీసుకొన్న నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రత్యామ్నాయమార్గాలను వెతుకుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ఇటీవలనే బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చాడు.ఈ ఆర్డర్ ఆధారంగా అమెరికన్ స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా నిబంధనలను కఠినతరం చేశారు.

ఇన్పోసిస్ సంచలన నిర్ణయం

ఇన్పోసిస్ సంచలన నిర్ణయం

హెచ్ 1 బీ వీసాల నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఇన్పోసిస్ సంచలన నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు అమెరికా నిబంధనలకు అనుగుణంగానే ఇన్పోసిస్ కూడ ఉద్యోగ నియమకాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇండియాకు చెందిన టెక్కీలను నియమించుకొని ఇతర దేశాల్లో పని కోసం పంపేవారు.అయితే హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ పాలకవర్గం ఆంక్షలు విధించడంతో అమెరికన్లనే నియమించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో ఇన్పోసిస్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. రానున్న రెండేళ్ళలో అమెరికాలో నివాసం ఉంటున్న స్థానికుల్లో పదివేల మందిని నియమించుకోనున్నట్టు ఇన్పోసిస్ ప్రకటించింది.

ఇండియా టెక్కీలకు షాకే

ఇండియా టెక్కీలకు షాకే

ఇన్పోసిస్ తో సహా ఇతర దేశీయ ఐటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఇండియాకు చెందినవారిని నియమించుకొని ఇతర దేశాలకు పంపేవారు. సీనియారిటీని బట్టి ఆయా దేశాలకు వారిని పంపేవారు. ఈ మేరకు ఇతర దేశాల్లో ఉద్యోగాలకోసం వెళ్ళేవారికి వేతనాల్లో కూడ భారీగానే పెరుగుదల ఉండేది. అంతేకాదు విదేశాల్లో ఇంకా మెరుగైన అవకాశాలు టెక్కీలకు దక్కే అవకాశాలు ఉండేవి.అయితే హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు ఎక్కువ కావడంతో ఆయా దేశాల్లో ఉండే స్థానికులనే ఉద్యోగులుగా నియమించుకోవాలని ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి.

అమెరికాలో 4 టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు

అమెరికాలో 4 టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగంలో సుమారు 10 వేల మంది అమెరికా ఐటీ ఉద్యోగులను నియమించుకొనేందుకు ఇన్సోసిస్ రడీ అవుతోంది. ఈ మేరకు అమెరికాలో 4 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఇన్పోసిస్ ప్రకటించింది. ప్రధానంగా ఇండియానాలో ఆగష్టులో మొదటి సెంటర్ ను ప్రారంబించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో అమెరికన్లను నియమించుకొనేందుకు చూస్టున్నట్టు ఇన్పోసిస్ సీఈఓ విశాల్ సిక్కా రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.

ఇప్పటికే 2 వేలమంది ఉద్యోగుల నియామకం

ఇప్పటికే 2 వేలమంది ఉద్యోగుల నియామకం

2014 లో ప్రారంభించిన ప్రయత్నంలో భాగంగా సంస్థ 2 వేల మందిని ఇప్పటికే నియమించుకొన్నట్టు తెలిపారు. అంతేకాదు అమెరికా వైపు నుండి ఆలోచించినప్పుడు మరింత మంది అమెరికన్లకు ఉద్యోగావకాశాలు సృష్టించడం మంచి విషయమమేనని చెప్పారు విశాల్ సిక్కా.

English summary
India-based IT services firm Infosys Ltd said late on Monday that it plans to hire 10,000 American workers in the next two years and open four technology centers in the United States, starting with a center this August in Indiana, the home state of Vice President Mike Pence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X