Home Minister: మీ బాధ్యతలు, లక్షణాలు ఇవేనా మంత్రిగారు ?, కారు కూడా ఆపకుండా వెళ్లిపోయారు !
హోమ్ మంత్రి ఎస్కార్ట్ వాహనం ఓ వ్యక్తి బైక్ ను డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అతను చనిపోయాడు. ప్రమాదం జరిగిందని తెలిసినా హోమ్ మంత్రి మాత్రం కారు దిగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బెంగళూరు/హాసన్: ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి తరువాత అంత పవర్ ఫుల్ మంత్రి పదవి ఏదంటే హోమ్ మంత్రి పదవి. ఎమ్మెల్యే అయినా, మంత్రులు అయినా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఆసక్తి చూపించాలి. అయితే హోమ్ మంత్రి ఎస్కార్ట్ వాహనం ఓ వ్యక్తి బైక్ ను డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అతను చనిపోయాడు. ప్రమాదం జరిగిందని తెలిసినా హోమ్ మంత్రి మాత్రం కారు దిగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఎన్నికల సమయంలో హోమ్ మంత్రి తీరుతో అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారని తెలిసింది.

హోమ్ మంత్రి ఎస్కార్ట్
కర్ణాటక హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్రకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనం బైక్ ను ఢీకొనడంతో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి తీవ్రగాయాలై ఆసుపత్రికి తరలించిన కొంత సేపటికే మృతి చెందాడు. అయితే హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మానవత్వం లేకుండా మృతి చెందిన దృశ్యాన్ని చూడకుండా. కనీసం కారు కూడా ఆపకుండా వెళ్లిపోయారని వెలుగు చూడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హాసన్ కు వెళ్లిన హోమ్ మంత్రి
కర్ణాటకలోని హసన్‌లో హోమ్ మంత్రికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనం బైక్‌ను ఢీకొట్టింది. పోలీసు జీపు అతివేగంగా నడపడం వలనే అదుపుతప్పి బైక్ ను ఢీకొనడంతో తీవ్రగాయాలైన రమేష్ అనే వ్యక్తి చనిపోయాడని వెలుగు చూసింది. తన ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టడంతో బైక్ లో వెలుతున్న వ్యక్తి రక్తపు మడుగులో పడిపోయి విలవిలలాడుతున్నాడని తెలిసినా హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర అది గమనించనట్లుగా కారు ఆపకుండా వెళ్లిపోయారని, ఆయనకు మానవత్వం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రిలో చనిపోయాడు
హోమ్ మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలైన హాసన్ జిల్లాలోని చిక్కగండాసి గ్రామానికి చెందిన రమేష్ ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికీ తరలించారు. అయితే చికిత్స విఫలమై రమేష్ (45) చనిపోయాడని వైద్యులు చెప్పారు. హోమ్ మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టిన తరువాత అతన్ని సరైన సమయంలో ఆసుపత్రికి తరలించి ఉంటే అతను ప్రాణాలతో ఉండేవాడని స్థానికులు అంటున్నారు.

బీజేపీ విజయ సంకల్పయాత్ర ముఖ్యమా మంత్రిగారు ?
బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర హాసన్ జిల్లా మీదుగా శివమొగ్గలోని ఆయన స్వగ్రామానికి వెళుతుండగా ఎస్కార్ట్ వాహనం బైక్ లో వెలుతున్న రమేస్ ను ఢీకొనింది. హోమ్ మంత్రి ఎస్కార్ట్ గా ఇన్స్ పెక్టర్ రాములు ఉన్నారని వెలుగు చూసింది. పెట్రోలు బంకులో బైక్ లో పెట్రోల్ పట్టించుకున్న రమేష్ అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చిన వెంటనే హోమ్ మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

హోమ్ మంత్రి బాధ్యతలు, లక్షణాలు ఇవేనా ?
ప్రమాదం గురించి తెలుసుకున్న హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వాహనం ఆపకుండా వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అమాయకుడు ప్రాణాలు కోల్పోయినా ఓ రాష్ట్రానికి బాధ్యతగల హోమ్ మంత్రిగా ఉన్న వ్యక్తి కనీస మానవత్వం చూపకుండా వెళ్లిపోవడంతో విమర్శించడానికి ప్రతిపక్షాలకు మంచి చాన్స్ చిక్కింది. అతి త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హోమ్ మంత్రి తీరుతో బీజేపీ నాయకులు తలలు పట్టుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications